AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema: అరె.. ఇంతందాన్ని విలన్‏గా మార్చేశారేంట్రా..? సీరియల్ బ్యూటీ గ్లామర్ సెన్సేషన్..

ప్రస్తుతం బుల్లితెరపై అందమైన విలన్ ఆమె. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫిట్నెస్, లుక్స్‏తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న ఈ బ్యూటీకి నెట్టింట ఓ రేంజ్ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేస్తున్న ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెస్మరైజ్ చేస్తుంది.

Telugu Cinema: అరె.. ఇంతందాన్ని విలన్‏గా మార్చేశారేంట్రా..? సీరియల్ బ్యూటీ గ్లామర్ సెన్సేషన్..
Aishwarya Varma
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2025 | 11:35 AM

Share

సాధారణంగా బుల్లితెరపై సీరియల్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ అడియన్స్ ఎక్కువగా చూసేది సీరియల్స్ మాత్రమే. అందుకే సినిమా హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా సీరియల్ తారలకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం టీవీల్లో ఎన్నో సీరియల్స్ జనాలను అలరిస్తున్నాయి. ఇక అందులో నటించే సెలబ్రెటీలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. తమ నటనతో జనాలను మెప్పిస్తున్న పాత్రలకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. నిజానికి సీరియల్స్ లో మెయిన్ రోల్స్ ఎప్పుడూ ఎమోషనల్ గా సాగుతుంటే తెగ బాధపడిపోతారు.. ఇక విలన్ పాత్రలలో కనిపించే ముద్దుగుమ్మలను తెగ తిట్టుకుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. సీరియల్స్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించేందుకు అందమైన భామలు ముందుకు వస్తున్నారు. పద్దతిగా కనిపిస్తూనే గ్లామర్ టచ్ ఇస్తూ కట్టిపడేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ గ్లామర్ అరాచకంతో రచ్చ చేస్తున్నారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ బ్యూటీ పేరు ఐశ్వర్య వర్మ. జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. డబ్బుపై ఆశతో..తల్లిదండ్రులను వదిలేసి పెద్ద కుటుంబంలో కోడలిగా సెటిల్ అయిన రోజా.. ఆ తర్వాత తన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనే పాత్రలో కనిపిస్తుంది.కన్నడలో ఇదివరకు పలు సీరియల్స్ చేసిన ఐశ్వర్య.. ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది.

ఈ అమ్మడు పుట్టి పెరిగింది మొత్తం బెంగళూరులోనే. తాను నటిని అవుతానని అసలు ఊహించలేదని.. తన కుటుంబం, బంధువులలోనూ ఎవరూ సినీరంగంలో లేరని.. ఎప్పుడైనా ఫేస్ బుక్ లో ఫోటోస్ పోస్ట్ చేయడంతో తనకు సీరియల్ ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. మొదట్లో యాక్టింగ్ అనగానే ఇంట్లో ఒప్పుకోలేదని.. కానీ తన ఆసక్తిని గమనించి చివరకు ఒప్పుకున్నారని చెప్పుకొచ్చింది. బంధన సీరియల్ ద్వారా కన్నడ రంగంలోకి అడుగుపెట్టింది. తనకు సినిమా ఆఫర్స్ చాలా వచ్చాయని.. కానీ దుస్తుల విషయంలో కంఫర్ట్ ఉండదని ఒప్పుకోలేదని తెలిపింది. అలాగే కొన్ని సినిమాలు పలు కారణాలతో మధ్యలోనే ఆగిపోయాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..