AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa Collections Day 3: కన్నప్ప 3వ రోజు కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇందులో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

Kannappa Collections Day 3: కన్నప్ప 3వ రోజు కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..
Kannappa Movie
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2025 | 12:29 PM

Share

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కన్నప్ప. ఈ చిత్రానికి డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు హిందీలో రామాయణ్, మహాభారత్ వంటి అద్భుతమైన సీరియల్స్ రూపొందించారు ముఖేష్ కుమార్. ఇది ఆయనకు తెలుగు మొదటి చిత్రం. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక మూడు రోజుల్లో మంచి వసూళ్లు రాబడుతూ థియేటర్లలో దూసుకుపోతుంది ఈ చిత్రం. ప్రస్తుతం కన్నప్ప బాక్సాఫీస్ వద్ద ధనుష్ నటించిన కుబేరా చిత్రంతో పోటిపడుతుంది. ఈ రెండు చిత్రాలకు అడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది.

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. కన్నప్ప మూడవ రోజు రూ.7.25 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. శనివారం వచ్చిన వసూళ్ల కంటే.. నిన్న ఒక్కరోజే భారీగా లాభాలు వచ్చినట్లు సమాచారం. ఆదివారం నాడు తెలుగు ప్రేక్షకులలో కన్నప్ప సినిమా మొత్తం మీద 39.93% ఆక్యుపెన్సీని సాధించింది. కన్నప్ప, కుబేర రెండు చిత్రాలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే అడియన్స్ ముందుకు వచ్చాయి.ఇప్పుడు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతున్నాయి. విడుదలైన మొదటి మూడు రోజుల ప్రదర్శనతో పోల్చి చూస్తే, కుబేర సినిమా రూ. 48.6 కోట్లు వసూలు చేయగా, కన్నప్ప అదే సమయంలో రూ. 23.75 కోట్లు వసూలు చేసింది.

ప్రస్తుతం కన్నప్ప సినిమాపై సినీప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతి ముఖుందన్, మోహన్ బాబు, ఆర్. శరత్‌కుమార్, అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మందా, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, రఘుబాబు నటించారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..