AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

ఒకప్పుడు తెలుగు సినీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ఆమె. పాకీజా అలియాస్ వాసుగిగా సినీప్రియులకు పరిచయమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పాకీజా.. ఇప్పుడు దీనస్థితిలో పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేస్తున్నానని.. ఏపీ ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Pakeezah
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2025 | 8:08 AM

Share

తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన కామెడీతో ఓ గురింపు తెచ్చుకుంది కమెడియన్ వాసుగి. ఈ పేరు చెబితే అసలే గుర్తుపట్టలేరు. కానీ పాకీజా అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 1990 దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా పాత్రతో మరింత ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె నటన ఇప్పటికీ అడియన్స్ మర్చిపోలేరు. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. పాకీజా పేరుతో సినీప్రియులకు దగ్గరైన ఆమె.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో జనాల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమె పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె తాజాగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే గుంటూరులో ఆమెను కొందరు మీడిాయ ప్రతినిధులు పలకరించగా.. తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వాసుగి. తమిళనాడులో తనకు ఎవరూ సాయం చేయడం లేదని.. అందుకే ఏపీ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసి తన సమస్య చెప్పుకోవాలని ఉందన్నారు. ప్రస్తుతం తనకు పూట గడవడమే కష్టంగా ఉందని..కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుందని.. తన గురించి వీడియో తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖులకు పంపినప్పటికీ ఎవరూ స్పందించలేదని అన్నారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలు స్పందించి తనను ఆదుకున్నారని.. ఒకవేళ వారు స్పందించకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తన గోడు వినిపించుకోవాలని ఉందని.. తనుక పింఛన్ సౌకర్యం కల్పిస్తే..వారి పేరు చెప్పుకుని బతుకుతానని అన్నారు. వాసుగి తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. అసెంబ్లీ రౌడీ, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు వంటి చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. తమిళనాడు సీఎం జయలలిత ఆహ్వానంతో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న వాసుగి.. జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..