AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. బాబుకు ఏం పేరు పెట్టిందో తెలుసా.. ?

మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె. ఆనతికాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఆమె రెండోసారి తల్లైనట్లు ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. అలాగే తన కొడుకు ఫోటోస్ సైతం షేర్ చేసింది.

Tollywood: రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. బాబుకు ఏం పేరు పెట్టిందో తెలుసా.. ?
Ileana
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2025 | 7:28 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో దక్షిణాదిని ఏలేసింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రవితేజ, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోల సరసన అనేక హిట్ మూవీస్ చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ అక్కడ కూడా కొన్నిరోజులకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇండస్ట్రీ నుంచి అనుహ్యంగా దూరమయ్యింది. తన ప్రియుడిని సైలెంట్ గా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. 2023లో ఓ బాబుకు జన్మనిచ్చిన ఆ హీరోయిన్.. ఇప్పుడు మరోసారి తల్లైంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ ఇలియానా.

పోకిరి సినిమాతో సినీరంగంలోకి స్టార్ డమ్ సంపాదించుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా.. మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి విషయాన్ని బయటపెట్టలేదు. 2023లో ఓ బాబుకు జన్మనిచ్చింది. తన కొడుకుకు ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్లు తెలిపింది. ఇక ఇటీవలే కొన్ని రోజుల క్రితం బేబీ బంప్ ఫోటోస్ పంచుకుంది. రెండోసారి తను ప్రెగ్నెంట్ అయినట్లు తెలిపింది. ఇప్పుడు మరోసారి పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు చెబుతూ తన కొడుకు ఫోటోస్ షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

అలాగే తన రెండో కొడుకు జూన్ 19న జన్మించాడని.. అతడికి కేను రాఫ్ డోలన్ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆమెకు అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..