AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు సాఫ్ట్‏వేర్ జాబ్ చేస్తోన్న బ్యూటీ.. ఇప్పుడేలా ఉంటే..

సినీరంగంలో తొలి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుని ఆతర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. తక్కువ సమయంలోనే అడియన్స్ హృదయాలను గెలుచుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు ఐటీ జాబ్ లో సెటిల్ అయ్యింది.

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు సాఫ్ట్‏వేర్ జాబ్ చేస్తోన్న బ్యూటీ.. ఇప్పుడేలా ఉంటే..
Deeksha Seth
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2025 | 11:10 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల క్రష్ గా మారిన ఈ వయ్యారి.. ఆనతికాలంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యింది. వరుస అవకాశాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది అనుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమా పరిశ్రమ నుంచి కనుమరుగైంది. ఆమె ఎవరో తెలుసా.. ?.. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే దీక్షా సేత్. ఈ పేరు చెబితే అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు. దీపాలి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశపరిచింది. అలాగే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ జోడిగా వేదం చిత్రంలో రిచ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే అందం, అభినయంతో జనాలను కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. యాక్షన్ హీరో గోపిచంద్ సరనస వాంటెడ్ సినిమాలో మెరిసింది. అలాగే రవితజ సరసన నిప్పు, మిరపకాయ చిత్రాల్లో కనిపించింది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు. దీంతో నెమ్మదిగా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి.

ఇవి కూడా చదవండి

చివరగా 2012లో ఊ కొడతార ఉలిక్కిపడతారా సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2 వంటి చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ కూడా అంతగా కలిసిరాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఐటీ జాబ్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు.

View this post on Instagram

A post shared by Deeksha Seth (@deeksha721)

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

Follow Us
ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని నాకు ముందే తెలుసు: రాశీఖన్నా
ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని నాకు ముందే తెలుసు: రాశీఖన్నా
హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
ద్రవిడ్, బిన్నీ, మిథాలీలకు బీసీసీఐ లైఫ్‌టైమ్ అవార్డులు
ద్రవిడ్, బిన్నీ, మిథాలీలకు బీసీసీఐ లైఫ్‌టైమ్ అవార్డులు
ఈ నక్షత్రాల్లో పుట్టినవారు భాగ్యవంతులయ్యే ఛాన్స్..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారు భాగ్యవంతులయ్యే ఛాన్స్..!
వేసవిలో కారు ఆగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే
వేసవిలో కారు ఆగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే
ఉగాది గిఫ్ట్‌ అంటే ఇది కదా.. సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్
ఉగాది గిఫ్ట్‌ అంటే ఇది కదా.. సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్
మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే షాక్.. అపార్ట్‌మెంట్‌ ఆక్రమణ
మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే షాక్.. అపార్ట్‌మెంట్‌ ఆక్రమణ
శని గ్రహ ప్రభావంతో చక్రం తిప్పబోయే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..?
శని గ్రహ ప్రభావంతో చక్రం తిప్పబోయే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..?
ఆ సినిమా దెబ్బకు అండర్‌గ్రౌండ్‌‏కు వెళ్లిపోయా..
ఆ సినిమా దెబ్బకు అండర్‌గ్రౌండ్‌‏కు వెళ్లిపోయా..
'టాక్సిక్' హీరో యశ్‌పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
'టాక్సిక్' హీరో యశ్‌పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు