- Telugu News Photo Gallery Cinema photos Anjali latest gorgeous looks in saree goes viral in social media
Anjali: ప్రేమతో జాబిల్లి చీరగా ఈ సుకుమారిని హత్తుకుంది.. గార్జియస్ అంజలి..
అంజలి.. తెలుగు, తమిళ చిత్రాలలో ఫేమస్ నటి. ఈమె గురించి తెలియని తెలుగువారు ఉండరు. ఆమె మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్, రెండు నంది అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా చీరలో కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. వీటిని చూసిన కుర్రాళ్లంతా తెగ లైకులు కొట్టేస్తున్నారు.
Updated on: Jun 30, 2025 | 10:50 AM

16 జూన్ 1986న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి ప్రాంతమైన రాజోలులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అంజలి. ఈమె అసలు పేరు బాలాత్రిపురసుందరి. ఈశ్వర్ శివ ప్రకాష్, పార్వతి దేవి ఈమె తల్లిదండ్రులు. ఆమెకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

రజోల్‌లోనే ఓ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత తమిళనాడులోని చెన్నైకి వెళ్ళింది. చెన్నై నగరంలో ఓ ప్రముఖ ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి గణితశాస్త్రం విభాగంలో డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల తార.

చదువు పూర్తయిన తర్వాత షార్ట్ ఫిల్మ్‌లలో నటించడం ప్రారంభించింది. అదే ఆమె సినీ రంగ ప్రవేశానికి మార్గం వేసింది. తన తల్లితండ్రులు నటులు కావాలనుకొని ఆమె ద్వారా వారు తమ కలలను సాకారం చేసుకున్నారని అంజలి ఓసారి తెలిపింది.

2006లో ఫోటో అనే ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ అందాల భామ. 2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మరెన్నో తెలుగు సినిమాల్లో నటించింది.

2024లో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ అఫ్ గోదావరి చిత్రాల్లో నటించిన. ఈ ఏడాది గేమ్ చెంజర్, మదగజరాజ సినిమాల్లో కనిపించింది. అదే ఏడాది బహిస్కరణ అనే ఓ వెబ్‌సిరీస్ చేసి ఆకట్టుకుంది ఈ అందాల తార.




