- Telugu News Photo Gallery Cinema photos Krithi Shetty Shares Latest Stunning Photos Goes Viral In Social Media
Krithi Shetty: గ్లామర్ ఫోజులతో మతిపోగొడుతున్న బేబమ్మ.. అయినా పట్టించుకోని టాలీవుడ్..
మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. చూడచక్కని రూపం.. సహజమైన నటనతో కుర్రకారు హృదయాను దోచేసింది. దీంతో ఈ అమ్మడి పేరు తొలి చిత్రం విడుదలకు ముందే మారుమోగింది. ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టడంతో ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. కానీ కొన్నాళ్లుగా తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
Updated on: Jun 30, 2025 | 12:39 PM

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ఈ హీరోయిన్. అందం, అభినయంతో కుర్రాళ్ల మది దోచేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే బిజీగా మారిపోయింది. కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు మినహా.. మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో బేబమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. చివరగా శర్వానంద్ సరసన మనమే సినిమాలో కనిపించింది. ఈ మూవీ సైతం నిరాశ పరచడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది ఈ వయ్యారి.

ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ వయ్యారి.. తమిళం, మలయాళం భాషలలోనే ఎక్కువగా నటిస్తుంది. ఇప్పుడు ఈ రెండు భాషలలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ వయ్యారి.. ప్రస్తుతం షేర్ చేసిన గ్లామరస్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

ఇన్నాళ్లుగా పద్దతిగా కనిపించిన బేబమ్మ.. ఇప్పుడు గ్లామర్ లుక్స్ తో మతిపోగొడుతుంది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఎల్ఐకే, జీనీ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలపైనే ఈ బ్యూటీ అంచనాలు పెట్టుకుంది. అలాగే ఇదివరకే మలయాళంలో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.

ఇక పై పాత్ర ప్రాధాన్యతకు తగినట్లుగా గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు లేకుండా ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంది బేబమ్మ.కానీ ఇప్పటికీ ఈ అమ్మడు ఒక్క సినిమా సైతం ప్రకటించలేదు. తెలుగులో ఈ అమ్మడుకు అవకాశాలు అంతగా రావడం లేదు. ఎక్కువగా తమిళంలోనే నటిస్తుంది.




