గుండెకు శ్రీరామరక్ష.. బరువును తగ్గించే బ్రహ్మాస్త్రం.. ఇది తాగితే బాడీని సర్ఫ్ వేసి కడిగినట్లే..
సొరకాయ జ్యూస్‌ను సరైన విధంగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం, శరీర హైడ్రేషన్‌కు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి రక్తపోటు నియంత్రణ, కొవ్వు తగ్గింపు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి.

సొరకాయ జ్యూస్.. ఆయుర్వేదంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారంగా నిలుస్తుందని. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అనేక మంది జ్యూస్ తాగేటప్పుడు ఫైబర్‌ను పక్కన పారేయడం లేదా అనవసరమైన షుగర్‌ను కలపడం వల్ల దాని అసలు ప్రయోజనాలను కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. అయితే, సొరకాయ జ్యూస్‌ను సరైన పద్ధతిలో తీసుకుంటే అది అద్భుతమైన ఆరోగ్య లాభాలను అందిస్తుంది. సొరకాయ జ్యూస్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఒక అద్భుతమైన సహజ పానీయమని.. ముఖ్యంగా సొరకాయ రసం శరీరానికి కావలసిన 6 కీలక ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పోషకాల గని..
సొరకాయ విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి విటమిన్లతో పాటు పొటాషియం, ఫైబర్ వంటి ఖనిజాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ పోషకాలు శరీర అంతర్గత పనితీరుకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలకమైనవి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
జీర్ణక్రియకు అద్భుతమైనది..
సొరకాయ జ్యూస్ జీర్ణవ్యవస్థకు అత్యంత ప్రయోజనకరమైనది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ ఇండైజేషన్, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నేటి కాలంలో చాలా మంది బాధపడుతున్న పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యల నివారణకు కూడా ఇది సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, పేగుల కదలికలను క్రమబద్ధీకరించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.
బరువు నియంత్రణలో కీలక పాత్ర
బరువు తగ్గాలనుకునే వారికి లేదా బరువును నియంత్రించుకోవాలనుకునే వారికి సొరకాయ జ్యూస్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. జ్యూస్ తాగినప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది, దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. ముఖ్యంగా, ఉదయాన్నే ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల పగటిపూట తక్కువ ఆహారం తీసుకోవడానికి, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చర్మ, కేశ సంరక్షణ
సొరకాయలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గించి, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అలాగే, జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సహజమైన మెరుపును అందించడానికి సొరకాయ జ్యూస్ తోడ్పడుతుంది.
హైడ్రేషన్, డిటాక్సిఫికేషన్
సొరకాయ జ్యూస్‌లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది, శరీర కార్యకలాపాలు మెరుగ్గా జరగడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని విష పదార్థాలను (టాక్సిన్స్) తొలగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల మీరు ఫ్రెష్‌గా, శక్తివంతంగా అనిపిస్తుంది.
ఫ్యాట్ తగ్గతుంది – గుండెకు రక్ష
సొరకాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అధ్యయనాల ప్రకారం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంతో పాటు, ఐరన్ డెఫిషియన్సీని తగ్గించి, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్యాట్ ను కరిగిస్తుంది. కొవ్వును కరిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సొరకాయ జ్యూస్.. ఎలా తయారు చేయాలి, ఎప్పుడు తాగాలి?
సొరకాయను ముక్కలు చేసి, మిక్సీలో బాగా పట్టి, వడకట్టకుండా తాగడం ఉత్తమం. వడకట్టకుండా తాగడం వల్ల ఫైబర్ నష్టం ఉండదు. రుచి కోసం కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. ఈ జ్యూస్‌ను ఉదయం లేదా సాయంకాలం, మీకు వీలైనప్పుడు తీసుకోవచ్చు. ఇలా సొరకాయ జ్యూస్‌ను మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, శ్రేయస్సును పొందవచ్చు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
