OTT Movie: థియేటర్లలో ఆడియెన్స్‌కు దడ పుట్టించిన సినిమా.. ఈ సైకో థ్రిల్లర్ మూవీని ఒంటరిగా మాత్రం చూడొద్దు
26 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది కొన్ని రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపారంటే అతిశయోక్తి కాదు.

ఈ మధ్య కాలంలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు బాగా ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీలు వచ్చాక ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే సుమారు 26 ఏళ్ల క్రితమే ఓ భయంకరమైన సైకో థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు భయంతో వణికిపోయారట. అలాగేఈ సినిమా చూసిన తర్వాత కొంతమంది కొన్ని నెలల పాటు సరిగ్గా నిద్రపోలేకపోయారని కూడా చెబుతారు. అంతలా ఈ సినిమా లోని సన్నివేశాలు ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేశాయట. ముఖ్యంగా విలన్ పాత్ర ప్రేక్షకులకు దడ పుట్టించిందట. ఈ విలన్ పాత్ర వల్లనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
1998లో విడుదలైన ఈ చిత్రం పేరు ‘దుష్మాన్’. ఇందులో సంజయ్ దత్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే సినిమాలో హైలెట్ గా నిలిచింది మాత్రం విలన్ గా నటించిన అశుతోష్ రాణా. భయంకరమైన సైకో కిల్లర్ గా అతని అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో, అశుతోష్ రాణా గోకుల్ పండిట్ పాత్రను పోషించాడు. మనుషులను తినే నరమాంస భక్షకుడిగా అతని పాత్ర ప్రేక్షకులను వణికించింది. ఇక ‘దుష్మన్’ సినిమాబాలీవుడ్‌లోని బెస్ట్ సైకో థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా హిందీలో మాత్రమే కాదు.. ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ హాండిక్యాప్‌డ్ పాత్రలో నటించాడు. అలాగే కాజోల్ ‘సోనియా’, ‘నైనా సెహగల్’ అనే రెండు పాత్రలను పోషించింది. అయితే కరడుగట్టిన విలన్ అశుతోష్.. కాజోల్ సోదరి సోనియాను దారుణంగా రేప్ చేసి చంపుతాడు. దీంతో తన సోదరి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో నైనా రగిలిపోతుంది.అయితే అశుతోష్ దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించరు. అటువంటి పరిస్థితుల్లో కాజోల్ తన ప్రేమికుడు సంజయ్ దత్ సహాయంతో విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేదే సినిమా.
దుష్మన్ సినిమా ప్రస్తుతం యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. అలాగే అమెజాన్ ప్రైమ్ OTTలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సైకో థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి దుష్మన్ ఒక మంచి ఛాయిస్. అయితే పిల్లలతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. అలాగే రాత్రి వేళల్లోనూ ఈ మూవీని చూడకపోవడమే బెటర్.
Dushman!#dushman #ashutoshrana pic.twitter.com/PKP94utgWt
— RVCJ Movies (@rvcjmovies) June 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..