Tollywood: 64 ఏళ్ల స్టార్ హీరో సరసన 34 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ప్రస్తుతం కొత్త కొత్త జానర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. కంటెంట్ నచ్చితే చాలు జనాలు చిన్న సినిమాలను సైతం ఆదరిస్తున్నారు. కానీ మీకు ఒక సినిమా గురించి తెలుసా.. ? 2007లో విడుదలైన ఈ మూవీ సినిమాలోని సాధారణ మూస పద్దతిని బద్దలుకొట్టింది. అలాగే సినీరంగంలోకి రోటిన్ ప్రేమకథలను మార్చేసింది.

2007లోవిడుదలైన ఓ సినిమా ఇండస్ట్రీలోని సాధారణ మూస పద్దతిని బద్దలు కొట్టింది. యంగ్ హీరోహీరోయిన్ మధ్య వచ్చే ప్రేమకథనే మార్చేసింది. ప్రేమ అనే ఒక మాటకు మరో అర్థాన్ని చెప్పింది. ఈ సినిమా 64 ఏళ్ల హీరో.. 34 ఏళ్ల హీరోయిన్ మధ్య వచ్చే అందమైన ప్రేమకథను చూపించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 45 రోజుల్లో పూర్తైన షూటింగ్.. బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకీ ఆ సినిమా ఎంటో తెలుసా..? అదే చీనీ కమ్.. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టబు కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్. బుద్దదేవ్ గుప్తా (అమితాబ్ బచ్చన్) లండన్ లోని ఒక ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్ లో మెయిన్ చెఫ్. నీనా వర్మ (టబు) ఒకరోజు రెస్టారెంట్ కు వస్తుంది. ఆమె ఆర్డర్ చేసిన ఆహారం సరిగ్గా లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారుతుంది. వీరిద్దరి ప్రేమకు డబ్బు, కులం అడ్డంకులు లేవు. ఒకటి వయసు మాత్రమే వ్యత్యాసం. చివరకి ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. ? వారిద్దరూ కలిసిపోయారా ? అనేది సినిమా కథ.
కేవలం 11 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.24 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి ఆర్. బాల్కి దర్శకత్వం వహించారు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్న ప్రేమకథ.. అమితాబ్, టబు మధ్య కెమిస్ట్రీ, యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా టబు ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ గెలుచుకుంది. అంతేకాకుండా 2007 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు. ప్రస్తుతం ఈమూవీ జీ 5, సోనీలివ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..