OTT Movie: బాబోయ్.. ఏం సినిమా రా బాబు.. క్లైమాక్స్ చూడాలంటే గుండెల్లో వణుకే.. భయంకరమైన హారర్ థ్రిల్లర్..
మీకు హర్రర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టమా..? ఇప్పుడు ఈ జానర్ చిత్రాలకు, వెబ్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్న హర్రర్ థ్రిల్లర్ సినిమాలు , వెబ్ సిరీస్ రూపొందించేందుకు మేకర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ గుండెల్లో వణుకు పుట్టించే ఈ మూవీ గురించి మీకు తెలుసా.. ?

ప్రస్తుతం ఓటీటీలో కామెడీ, హరర్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీకు గుండెల్లో భయం పుట్టించే ఒక థ్రిల్లర్ మూవీ గురించి మీకు తెలుసా..? ఒక గ్రామంలో జరిగే డ్రామా గురించి మీరు తెలుసుకోవాల్సింది. ఈ చిత్రంలో వచ్చే ప్రతి సీన్ మీకు భయం పుట్టిస్తోంది. ఇది ఒక హారర్-థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ పేరు ‘బేతాల్’. వినీత్ కుమార్ సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అహానా కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ సిరీస్ ఇది. ఒక మారుమూల గ్రామానికి ప్రభుత్వం పెద్ద ప్రాజెక్ట్ ప్రకటిస్తుంది.. దీంతో అక్కడ తవ్వకం పనులు చేసేందుకు అధికారులు గ్రామానికి వస్తారు. ఆ గ్రామం పక్కన ఉన్న సొరంగాన్ని తవ్వేందుకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకుంటారు.
గ్రామస్తుల నిరసనను చూసి ప్రభుత్వం కొంతమంది సైన్యాన్ని పంపుతుంది. ఈ సైన్యానికి వినీత్ కుమార్ పాత్రధారి కమాండర్ విక్రమ్ సిరోహి నాయకత్వం వహిస్తాడు. సిరోహి ఒక అవినీతి వ్యాపారవేత్తతో కుమ్మక్కై గ్రామస్తులను బలవంతంగా తరలించడానికి ప్రయత్నిస్తాడు.
ఆ తర్వాత సొరంగాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. అందులో నుంచి శక్తివంతమైన బ్రిటీష్ సైన్యం బయటకు వస్తుంది. అప్పుడే అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం ఎంతో భయంకరంగా తెరకెక్కించారు. క్రూరమైన మనుసులు.. రక్తంతో నిండిన బ్రిటిష్ సైన్యం భయంకరంగా కనిపిస్తారు. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం మీకు భయం పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..