Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా.. దేశంలోనే నెంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీల్లో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ జానర్ చిత్రాలకు రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. అలాగే థియేటర్లలో డిజాస్టర్స్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం అదే.

OTT Movie: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా.. దేశంలోనే నెంబర్ వన్ ట్రెండింగ్..
Thug Life
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2025 | 7:42 AM

Share

ఈ ఏడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయిన సినిమాల్లో ఇది ఒకటి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో విడుదలైన వెంటనే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మనం మాట్లాడుతున్న సినిమా పేరు ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

కమల్ హాసన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. డైరెక్ట్ర మణిరత్నం దీనికి దర్శకత్వం వహించారు. తమిళ భాషలో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇందులో త్రిష కృష్ణన్, శింబు, మహేష్ మంజ్రేకర్, అభిరామి, నాసర్, అశోక్ సెల్వన్, అలీ ఫజల్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే.. రంగరాయ శక్తివేల్ (కమల్ హాసన్) చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. రంగరాయ శక్తివేల్ ఒక ప్రమాదకరమైన డాన్. అతను పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఒక పిల్లవాడి ప్రాణాలను కాపాడతాడు. అదే సమయంలో అతని తండ్రి చనిపోవడంతో అతను ఆ పిల్లవాడిని తన సొంత బిడ్డలా పెంచుతాడు. శక్తివేల్ సొంత వ్యక్తులే అతనికి శత్రువులుగా మారి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. దీని తరువాత, కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఈ చిత్రంలో, 70 ఏళ్ల కమల్ హాసన్ అద్భుతమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు.

భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ‘థగ్ లైఫ్’ 2025 సంవత్సరంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. రూ. 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కేవలం రూ.100 కోట్లు సైతం రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..