Godavari Movie: గోదావరి సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? పవన్, మహేష్ మాత్రం కాదండోయ్
కుబేర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. జూన్ 20న విడుదలైన ఈ సినిమా వంద కోట్లకు చేరువలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన సినిమా కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారీ క్రియేటివ్ డైరెక్టర్.

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. హ్యాపీడేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఇలా ఆయన ఖాతాలో మంచి సూపర్ హిట్ సినిమాలున్నాయి. అయితే ఇందులో గోదావరి సినిమాకు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా క్యాప్షన్ ‘ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది’ అన్న తరహాలోనే గోదావరి మూవీ ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. అక్కినేని సుమంత్, కమలిని ముఖర్జీ ఇందులో హీరో, హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ నీతూ చంద్ర, కమల్ కామరాజు, మధుమణి, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2006 మే 19న థియేటర్లలో విడుదలైన గోదావరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ మూవీ ఆద్యంతం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక సుమంత్, కమిలిని ముఖర్జీల అభినయం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అలాగే పాటలు కూడా ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఈ మూవీ లో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. అందుకే ఈ సినిమాను చూస్తే దాదాపు దాదాపు గోదావరి నదిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఎన్నో విశేషాలతో కూడిన గోదావరి సినిమాకు సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్.. ఇలా ఐదు విభాగాల్లో నంది అవార్డులు దక్కాయి.
కాగా గతంలో పలువురు స్టార్ హీరోలు గోదావరి సినిమాను మిస్ చేసుకున్నారని వార్తలు, రూమర్లు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, గోపీచంద్, రవితేజ లు కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారని ప్రచారం జరిగింది. తాజాగా కుబేర సినిమా ప్రమోషన్లలో శేఖర్ కమ్ముల దీనిపై క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ మూవీ కోసం మహేశ్‌బాబునీ అనుకున్నానని, అయితే ఆయన్ను కలవలేదని శేఖర్ కమ్ముల తెలిపారు. ఈ సినిమా కోసం ముందుగా సిద్ధార్థ్ ను సంప్రదించారట ఈ క్రేజీ డైరెక్టర్. అయితేఈ స్టోరీ హీరోయిన్ ప్రధానంగా సాగుతుందన్న కారణంతో.. ఈ చిత్రంలో నటించేందుకు సిద్ధార్థ్ ఆసక్తి చూపించలేదని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. చివరగా అక్కినేని సుమంత్ గోదావరి సినిమాలో హీరోగా ఎంపికయ్యారు. రామ్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
#19YearsForGodavari#Sekharkamula brand with good sensibilities and emotions. It is considered as modern classic by the critics at that time.#Godavari Audiocd @MadhuraAudio@KMRADHAKRISHNA1 musical@iSumanth #kamalineemukherjee @sekharkammula @madhurasreedhar @kamalkamaraju pic.twitter.com/VB7mmCyv3q
— Moviez And Music Library (@MovzMusicals999) May 18, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








