Prabhas Sisters: ప్రభాస్ చెల్లెళ్లు ఇప్పుడెలా ఉన్నారో తెలుసా? రీసెంట్ ఫొటోస్ వైరల్
కొత్త ఏడాది '2025' ప్రారంభమై అప్పుడే ఆరు నెలలు గడిచిపోయింది. ఈ ఆరు నెలల్లో ఏం జరిగిందో తెలియజేస్తూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. మరికొన్ని రోజుల్లో ది రాజా సాబ్ గా మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు డార్లింగ్ . మారుతి తెరకెక్కిస్తోన్న ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైన పోస్టర్స్, గ్లింప్స్ డార్లింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ద రాజా సాబ్ తో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, అలాగే కల్కి 2, సలార్ 2 వంటి సినిమాలు కూడా ప్రభాస్ పూర్త చేయాల్సి ఉంది. ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనూ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ కు నలుగురు చెల్లెళ్లు ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా దివంగత నటుడు కృష్ణంరాజు కూతుళ్లు. ఈ నలుగురితో ఎంతో సరదాగా ఉంటాడు ప్రభాస్. ఇక ఈ నలుగురు చెల్లెళ్లలో ఇప్పటికే ప్రసీద నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ప్రసీద లేటెస్ట్ గ ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది లో గడిచిన ఆరు నెలల్లో ఏం జరిగిందో తెలియజేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోలను అందులో షేర్ చేసింది. ఇందులో తల్లి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా ఉన్నారు. ‘హాఫ్ వే దేర్..2025’ అంటూ ప్రసీద షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ సిస్టర్స్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
తల్లి శ్యామలా దేవితో..
View this post on Instagram
కల్కి సినిమా ప్రమోషన్లలో ప్రభాస్ సిస్టర్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..