AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soubin Shahir: మంజుమ్మల్ బాయ్స్ నటుడు అరెస్ట్.. షాక్‌ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

మలయాళ స్టార్ నటుడిగా చెలామణి అవుతోన్న సౌబిన్ సాహిర్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. అతను నటించిన అండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్‌, కుంబ‌లంగీ పైట్స్‌, రోమాంచం తదితర సినిమాలు తెలుగులోనూ రిలీజయ్యాయి. ఇక మంజుమ్మల్ బాయ్స్ తో ఆయన క్రేజ్ నేషనల్ వైడ్ కు పాకింది.

Soubin Shahir: మంజుమ్మల్ బాయ్స్ నటుడు అరెస్ట్.. షాక్‌ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
Malayalam Actor Soubin Shahir
Basha Shek
|

Updated on: Jul 09, 2025 | 6:47 AM

Share

మలయాళ ప్రముఖ నటుల్లో సౌబిన్ షాహిర్ ఒకడు . 2015 లో విడుదలైన ప్రేమమ్ చిత్రంతో ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే షాహిర్ కు పాన్-ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన చిత్రం మంజుమ్మల్ బాయ్స్. 2024 లో విడుదలైన ఆ చిత్రంతో దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. దీని తర్వాత మళ్లీ ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కూలీలో నటిస్తున్నాడీ స్టార్ యాక్టర్. రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ తో పాటు షౌబిన్ షాహిర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోన్న సౌబిన్ షాహిర్ ను పోలీసులు అరెస్టు అయ్యారు. మంజుమ్మల్ బాయ్స్ సినిమా నిర్మాణానికి సంబంధించిన మనీలాండరింగ్ ఫిర్యాదులో నటుడు సౌబిన్ షాహిర్ సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. మంజుమల్ బాయ్స్ సినిమా లాభాల్లో 40 శాతం ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, కానీ కేవలం రూ. 7 కోట్లు మాత్రమే ఇచ్చారని సిరాజ్ ఎర్నాకుళం కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ సహా మొత్తం 3 మందిని అరెస్టు చేశారు.

అయితే అరెస్ట్ జరిగిన వెంటనే ముగ్గురు ముందస్తు బెయిల్ కోరుతూ ఎర్నాకుళం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం అరెస్టయిన ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. దీంతో షాహిన్ తో మొత్తం ముగ్గురు ముందస్తు బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే సౌబిన్ అరెస్ట్ మాత్రం మలయాళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

కూలి సినిమా సెట్ లో అక్కినేని నాగార్జున తో

కూలీ సినిమా నటుడు రజనీకాంత్ 171వ చిత్రం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ నుండి నాగార్జున వరకు చాలా మంది ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Jamia Zaheer (@starsobrite)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..