AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT movie: పెద్ద హీరోహీరోయిన్స్ లేరు.. గ్లామర్ సాంగ్స్ లేవు.. అయినా ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా..

ఈమధ్య కాలంలో ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు వస్తున్నాయి. తాజాగా ఓ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ షేక్ చేస్తుంది. అందులో పెద్ద హీరోహీరోయిన్స్ లేరు.. అయినప్పటికీ దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ?

OTT movie: పెద్ద హీరోహీరోయిన్స్ లేరు.. గ్లామర్ సాంగ్స్ లేవు.. అయినా ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా..
Eleven Movie
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2025 | 9:44 PM

Share

ఇప్పటివరకు భారతీయ సినిమా ప్రపంచంలో, ‘దృశ్యం,’ ‘కోల్డ్ కేస్,’ ‘యు-టర్న్,’ ‘రాట్సాసన్’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సినిమాలే కాకుండా ఇప్పుడు ఓ కొత్త చిత్రం ఓటీటీని షేక్ చేస్తుంది. ఇది ప్రేక్షకులను ఆద్యంతం ఆక్టట్టుకుంటుంది. అలాగే ఈ సినిమాలోని సస్పెన్స్ కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ చిత్రంలో ట్విస్టులు అనుక్షణం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాగే ఇందులో స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. స్పెషల్ సాంగ్స్ లేకపోయినప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ?

ఇందులో సూపర్ స్టార్లు లేరు లేదా భారీ బడ్జెట్ లేదు, కానీ కథ, మానసిక మలుపులు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఆ సినిమా భయానక వాతావరణం, ఆశ్చర్యకరమైన సీన్స్, అస్పష్టమైన పాత్రలు సోషల్ మీడియాలో, విమర్శకులలో చర్చను సృష్టించాయి. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి చిత్రీకరించబడిన థ్రిల్లర్ మిస్టరీ చిత్రం ‘ఎలెవెన్’. ఈ చిత్రంలో రియా హరి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే నవీన్ చంద్ర, శశాంక్, అభిరామి, దిలీపన్, రితిక, ఆడుకలం నరేన్, రవివర్మ, అర్జై కీలకపాత్రలు పోషించారు.

‘ఎలెవెన్’ కథ విశాఖపట్నంలో జరుగుతున్న రహస్య హత్యల చుట్టూ తిరుగుతుంది. కవలలను మాత్రమే చేర్చుకునే ట్విన్ బర్డ్స్ అనే పాఠశాలకు సంబంధించిన సీరియల్ కిల్లర్ కేసును పరిష్కరించడానికి బాధ్యత వహించే ఇన్స్పెక్టర్ పాత్రను నవీన్ చంద్ర పోషిస్తాడు. దర్యాప్తు సమయంలో అరవింద్ అనేక షాకింగ్ రహస్యాలను తెలుసుకుంటాడు. ‘ఎలెవెన్’ మే 16, 2025న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 6.8 కోట్లు వసూలు చేసింది, అందులో రూ. 5 కోట్లు తమిళనాడు నుండి వచ్చాయి. ఈ చిత్రానికి లోకేష్ అజ్జల్స్ దర్శకత్వం వహించగా, డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ సినిమాతమిళ వెర్షన్ ఆహా తమిళ్, తెలుగు వెర్షన్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..

Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..

Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్‏గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‏తో రచ్చ.. ఎవరంటే..

Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్‏లో ఊహించని విధంగా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..