AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌లోకి ఆ నటుడి మాజీ లవర్! అందుకే ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చేసిందా?

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కానుంది. గతంలో కంటే భిన్నంగా ఈ సారి హౌస్ లో సర్ ప్రైజింగ్ స్టార్స్ సందడి చేయనున్నారని సమాచారం. ఈ క్రమంలో బుల్లితెరకు చెందిన ఓ అందాల నటి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌లోకి ఆ నటుడి మాజీ లవర్! అందుకే ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చేసిందా?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Jul 09, 2025 | 6:31 PM

Share

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఈసారి మరిన్ని హంగులు, సర్ ప్రైజ్ లతో డబుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ రియాలిటీ షో ఎనిమిది సీజన్లు పూర్తి కగా త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో కూడా రిలీజైంది. ఇది కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది. మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మాటీవీలో ప్రసారమైన కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్, జాతి రత్నాలు వంటి టీవీషోల ద్వారా కొంత మంది కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ షోస్ లో ప్రముఖంగా కనిపించిన జబర్దస్త్ ఇమ్మానుయేల్, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, జబర్దస్త్ ఐశ్వర్యతో పాటు మరో ఇద్దరు బుల్లితెర ఆర్టిస్టుల పేర్లు కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్నారని బలంగా ప్రచారం జరుగుతోంది. కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో మరో ప్రముఖ నటి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు సీరియల్ స్టార్ కావ్య శ్రీ. అదేనండి గతేడాది బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ మాజీ లవర్. కంటెస్టెంట్ల లిస్టులో ఈ బ్యూటీ పేరు వినిపించడానికి ఓ ప్రధాన కారణం ఉంది. అదేంటంటే..

కావ్య ప్రస్తుతం ‘చిన్ని’ అనే సీరియల్‌లో నటిస్తోది. అయితే అనూహ్యంగా ఈ సీరియల్ లో ఆమె పాత్రను చంపేశారు. అంతేకాదు కొత్త నటిని కూడా పరిచయం చేశారు. దీంతో కచ్చితంగా కావ్య ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందన్న వార్తలకు బలం చేకూరింది. మరీ ముఖ్యంగా ఆమె సడెన్‌గా సీరియల్‌ను వదిలేయడం, బిగ్ బాస్ ఆఫర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని చాలా మంది భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కావ్య ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

గత సీజన్‌లో కావ్య శ్రీ మాజీ ప్రియుడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి ఏకంగా టైటిల్ విన్నర్‌గానూ నిలిచాడు. అప్పుడు కావ్య పేరు కూడా హౌస్ లో మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. అయతే గతేడాది నిఖిల్ బిగ్ బాస్‌కి వెళ్లి విన్నర్ గా నిలిస్తే, ఇప్పుడు కావ్య శ్రీ బిగ్ బాస్ కు ప్లస్ అవుతుందని ఆడియెన్స్ భావిస్తున్నారు. మరి కావ్యశ్రీ బిగ్ బాస్ కు వస్తుందా?రాదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..