AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RK Sagar: మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్కే సాగర్ ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లలు ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్

చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు ఆర్కే సాగర్. ఆ తర్వాత సీరియల్స్ కు గుడ్ బై చెప్పి సినిమాల్లో నటిస్తున్నాడు. సాగర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది 100 జులై 11న థియేటర్స్ లో రిలీజ్ కానుంది

RK Sagar: మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్కే సాగర్ ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లలు ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్
RK Sagar
Basha Shek
|

Updated on: Jul 09, 2025 | 9:09 AM

Share

ఆర్కే నాయుడు అలియాస్ సాగర్.. తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు ఫేవరెట్ నటుడు. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి ఈ నటుడికి పెద్ద ఫ్యాన్ అంటే సాగర్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు. ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్ లో ఆర్కే నాయుడు, మున్నా, మహిధర్ నాయుడిగా బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. అయితే వీటి తర్వాత బుల్లితెరపై కనిపించలేదు సాగర్. వెండితెరపై నటుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్, సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక 2021లో వచ్చిన షాదీ ముబారక్ సినిమాతో హీరోగానూ సక్సెస్ అయ్యాడు సాగర్. అయితే ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ది హండ్రెడ్ అంటూ ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజైంది. ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సాగర్. ఈ క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఇలా చెప్పుకొచ్చాడు సాగర్. ‘నా భార్య పేరు సౌందర్య. గతంలో ఒక డిజిటల్ మీడియా కంపెనీ నిర్వహించింది. అయితే పిల్లలు పుట్టాక గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఆత్మన్ ది లేబుల్ అనే క్లాత్ బ్రాండ్ ని ప్రారంభించింది. క్లాత్ బిజినెస్ చేస్తుంది. అందులో ఇంకా రీసెర్చ్ కూడా చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడు సాగర్.

ఇవి కూడా చదవండి

భార్యతో ఆర్కే సాగర్..

ఆర్కే సాగర్, సౌందర్య దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. సౌందర్య తన పిల్లల పెంపకంతో పాటు క్లాత్ బిజినెస్ కూడా రన్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తన బిజినెస్ కి సంబంధించిన విషయాలను రెగ్యులర్ గా అందులో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన పిల్లల ఫొటోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది.

ఆర్కే సాగర్ ఫ్యామిలీ ఫొటో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..