రజినీకాంత్, కమల్ హాసన్‌లతో నటించిన స్టార్ హీరోయిన్.. ఆకలితో అలమటించి.. చివరకు ఎయిడ్స్ బారిన పడి..
వెండితెరపై అందం, అభినయంతో అలరించిన తారల జీవితాలు కనిపించే అంత అందంగా ఉండవు. సినిమాల్లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్స్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇక కొందరి నిజ జీవిత సంఘటనలు సినిమాల్లో చూపించే కథల కంటే విషాదకరంగా ఉంటాయి. అందులో ఈ హీరోయిన్ లైఫ్ సైతం.

సాధారణంగా సినిమాల్లో చూపించే కంటే వాస్తవ సంఘటనలు ఎంతో విషాదకరంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా తారల జీవితాలు అత్యంత క్లిష్టంగా సాగుతుంటాయి. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. జీవితం మాత్రం ఎన్నో కష్టాలతో సాగింది. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె చివరి రోజుల్లో చెప్పలేని దుఃఖాన్ని అనుభవించింది. ఆమె పేరు నిషా నూర్. 80లలో ఆమె అగ్రకథానాయికగా ఇండస్ట్రీని శాసించింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. 1980లో ‘మంగళ నాయకి’ అనే తమిళ చిత్రం ద్వారా ఆమె నటిగా రంగప్రవేశం చేసింది.
ఆ తర్వాత ఇలమై కోలం, ఎనక్క కాతిరు, టిక్ టిక్ టిక్ వంటి చిత్రాల్లో నటించి పాపులారిటీని సంపాదించుకుంది. రజినీకాంత్ నటించిన శ్రీ రాఘవేంద్ర, బాలచందర్ తెరకెక్కించిన కళ్యాణ ఆగతిగళ్ వంటి అనేక సినిమాల్లో కనిపించింది. అలాగే ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమెకు డబ్బు సంపాదించడం కష్టమై ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తన కుటుంబం నుంచి ఎలాంటి సహయం అందలేదు. దీంతో ఒంటరిగానే జీవితంతో పోరాడింది. అయితే అప్పట్లో ఆమెను ఓ నిర్మాత బలవంతగా వ్యభిచారంలోకి దింపాడని.. దీంతో ఆమెకు అవకాశాలు రాలేదని అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేశాయి.
చాలా కాలం సినిమాలకు దూరమైన నిషా నూర్.. 2007లో కొందరు ఆమె దర్గా బయట గుర్తించారు. అప్పటికే ఆమెకు పూర్తిగా బక్కచిక్కిపోయి.. దారుణమైన స్థితిలో కనిపించింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. నిషా నూర్ కొన్నిరోజులు అనారోగ్యంతో బాధపడుతూ 2007 ఏప్రిల్ 23న మరణించింది.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..
Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..
Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌తో రచ్చ.. ఎవరంటే..
Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్లో ఊహించని విధంగా..








