AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘బాడీపై చేతులు వేసి’.. పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు .. రంగంలోకి పోలీసులు

మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల వార్తలు మనం ప్రతిరోజూ వింటూనే ఉన్నాము. అయితే సెలబ్రిటీలకూ ఈ వేధింపులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ప్రముఖ నటి ఒక పూజారి తనను లైంగికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Tollywood: 'బాడీపై చేతులు వేసి'.. పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు .. రంగంలోకి పోలీసులు
Indian Origin Actress
Basha Shek
|

Updated on: Jul 10, 2025 | 9:37 PM

Share

కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలు. బాలికలపై హింస, లైంగిక వేధింపులు తగ్గడం లేదు. కొందరు తమకు జరిగిన అన్యాయాన్ని మౌనంగా భరిస్తుంటే మరికొందరు మాత్రం ధైర్యంగా గొంతు విప్పుతున్నారు. తాజాగా మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్ ఒక పూజారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. గత శనివారం కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది దూరంలో ఉన్న సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయంలో ఈ ఘటన జరిగిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక తెలిపింది. తాజాగా నటి కూడా దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మలేషియా పోలీసులు భారతీయ పూజారి కోసం వెతుకుతున్నారు. భారతీయ పౌరుడైన ఒక పూజారి, ఆ పవిత్ర జలం భారతదేశం నుంచి వచ్చినదని చెబుతూ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని లిషల్లిని కనారన్ ఆరోపించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుందీ అందాల తార. ‘ జూన్ 21న నేను ఒంటరిగా గుడికి వెళ్లాను. ఆ సమయంలో ఆస్థాన పూజారి లేక‌పోవ‌డంతో అత‌ని స్థానంలో ఓ పూజారి తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతను నా వ‌ద్ద‌కు వ‌చ్చి కాసేపు ఆగ‌మని, ప్రార్థ‌న‌లు ముగిసిన త‌ర్వాత క‌లుస్తాన‌న్నాడు.

సుమారు గంట సేపు త‌ర్వాత ఆ పూజారి వ‌చ్చి నన్ను తన ప్రైవేటు ఆఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ నన్ను ఆశీర్వదిస్తున్నట్లు చెప్పి ఓ ద్రవాన్ని నాపై చల్లాడు. ఆ తర్వాత నా ఒంటిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ స‌మ‌యంలో నా బ్రెయిన్ ప‌నిచేయ‌లేదు. నోటి నుంచి మాట‌లు రాలేదు. పూర్తిగా నిశ్చేష్టురాలైపోయాను’ అని నటి వాపాపోయింది. గుడిలో పూజారి వేధించ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయాన‌ని, అందుకే ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా చెబుతున్న‌ట్లు ఆమె పేర్కొంది.

ఇవి కూడా చదవండి

లిషల్లిని కనారన్ లేటెస్ట్ ఫొటోస్..

కాగా ఈ విషయంపై పూజారిపై ఎవరో ఇప్పటికే ఫిర్యాదు చేశారు, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని కనారన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆలయ నిర్వహణ అధికారులు తనకు సహాయం చేయడానికి బదులుగా వారి పేరును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ప్రస్తుతం మలేషియా పోలీసులు భారతీయ పూజారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..