- Telugu News Photo Gallery Cinema photos Suhas's Back to Back Film Releases: From YouTube to Box Office Success
Suhas: ఏడాదికి ఒక్క సినిమానే కష్టం అంటుంటే.. వారానికి ఒక సినిమా చేస్తున్నాడు
ఈ రోజుల్లో ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే నానా తంటాలు పడుతున్నారు హీరోలు. అలాంటిది ఇక్కడో హీరో మాత్రం వారానికి ఓ సినిమా విడుదల చేస్తున్నాడు. ఏంటి నమ్మరా..? ఎందుకు నమ్మరు చెప్పండి.. మేం మీకు నమ్మేలా సాక్ష్యం చూపిస్తుంటే..? మొన్న వారమే ఆయన సినిమా వచ్చింది.. నెక్ట్స్ వీక్ కూడా మళ్లీ ఆయనే వస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?
Updated on: Jul 10, 2025 | 9:53 PM

యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి.. నిర్మాతలు నమ్మే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదగడమంటే చిన్న విషయం కాదు. దాన్ని చేసి చూపించారు సుహాస్.

కమెడియన్ నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారు సుహాస్. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తర్వాత వచ్చిన జనక అయితే గనక, ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు అంతగా ఆడలేదు.

మామూలుగా కమెడియన్ హీరోగా మారితే.. అతన్నుంచి కామెడీ సినిమానే ఊహిస్తాం. కానీ సుహాస్ మాత్రం కలర్ ఫోటో నుంచే విభిన్నంగా ట్రై చేస్తున్నారు. మొన్న జులై 4న కీర్తి సురేష్‌తో కలిసి ఈయన నటించిన ఉప్పు కప్పురంబు ఓటిటిలో విడుదలైంది.

వచ్చే వారం.. అంటే జులై 11న కూడా ఈయన నటిస్తున్న ఓ భామ అయ్యో రామా థియేటర్‌లో విడుదల కాబోతుంది. చిత్రలహరి టాకీస్, V ఆర్ట్స్ బ్యానర్స్‌పై ప్రదీప్ రెడ్డి, హరీష్ నల్లా సంయుక్తంగా సుహాస్ సినిమాను నిర్మిస్తున్నారు.

మాళవిక మనోజ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి కలర్ ఫుల్ లవ్ స్టోరీలో నటించారు సుహాస్. ట్రైలర్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. జులై 11న పోటీ లేకపోవడంతో.. ఆ గ్యాప్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు ఈ నటుడు.




