- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Charges rs 10 Lakhs Per Second, She Have Private Jet, She Is Nayanthara
Telugu Cinema: సెకనుకు రూ.10 లక్షలు.. సొంతంగా ప్రైవేట్ జెట్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదు..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్. రూ.100 కోట్లకుపైగా ఆస్తులు.. సొంతంగా రూ.50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్.. అంతేకాదు.. దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతేకాదు.. సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే తారలలో ఆమె ఒకరు. సెకనుకు రూ. 10 లక్షలు వసూలు చేసిన ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ?
Updated on: Jul 10, 2025 | 9:28 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారల గురించి చెప్కక్కర్లేదు. దీపిక, కత్రినా, కరీనా కపూర్, సమంత, రష్మిక మందన్నా పేర్లతోపాటు ఆమె పేరు సైతం సినీరంగంలో మారుమోగుతుంది.

దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో మొత్తం 80 సినిమాల్లో నటించింది. ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. లేడీ సూపర్ స్టార్ నయనతార. గతంలో ఓ ప్రకటన కోసం సంతకం చేసిందట నయన్. అందుకు 50 సెకన్లకు రూ.5 కోట్లు వసూలు చేసింది. ఈ యాడ్ తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడతో సహా 4 బాషలలో వచ్చింది.

ఈ యాడ్ చేయడానికి దాదాపు 2 రోజులు పట్టిందట. 2018 సంవత్సరంలో ఫోర్బ్స్ ఇండియా 'సెలబ్రిటీ 100' జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక దక్షిణాది నటి నయనతార. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఇంగ్లీష్ లో ఏంఏ చేసిన నయన్.. CA కావాలనుకుందట.

కానీ అనుహ్యంగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అయితే ఆమె కెరీర్ ముగిసిందని అనుకున్న సమయంలోన సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. నయనతార మలయాళ చిత్రం మనస్సినక్కరేతో దక్షిణ పరిశ్రమలోకి ప్రవేశించింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న హీరోయిన్లలో నయన్ ఒకరు. ప్రతి సినిమాకు దాదాపు రూ. 10 కోట్లు వసూలు చేస్తుంది. నివేదికల ప్రకారం, నయనతార రూ. 200 కోట్లకు యజమాని. ఆమెకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది, దీని ధర దాదాపు రూ. 50 కోట్లు.




