- Telugu News Photo Gallery Cinema photos Actress Ritu Varma Waiting For a Bit Hit, Her Photos Goes Viral
Ritu Varma: చేతినిండా సినిమాలు.. అయినా కలిసిరాని అదృష్టం.. హిట్టు కోసం బ్యూటీ వెయిటింగ్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఈబ్యూటీకి సరైన హిట్టు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యంగ్ భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jul 10, 2025 | 9:17 PM

రీతూ వర్మ.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్ గా సత్తా చాటుతుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ మాత్రం రాలేదు.

తెలుగుతోపాటు తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. కెరీర్ తొలినాళ్లల్లో పలు షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ అమ్మడు.. బాద్షా సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో కథానాయికగా మారింది.

తెలుగులో నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులో టక్ జగదీష్, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని , స్వాగ్ చిత్రాలతో అలరించింది.

ఇప్పుడు తెలుగులో విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది. కానీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్టు అందుకోలేకపోయింది. ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచుూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. యాక్షన్ సినిమాలతోపాటు గ్లామర్ సీన్స్ చేసేందుకు సైతం రెడీ అంటుంది రీతూ. కథలో డిమాండ్ ఉండి.. కథకు తగ్గట్లుగా చేస్తానని.. గ్లామర్ షోకు తాను దూరం కాదంటుంది రీతూ వర్మ.




