AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మేం నలుగురం కాబోతున్నాం.. మళ్లీ తల్లి కానున్న టాలీవుడ్ ప్రముఖ నటి.. ఎమోషనల్ వీడియో వైరల్

పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లిగా మారి అమ్మ అని పిలిపించుకున్నప్పుడే ఒక మహిళ జీవితం పరిపూర్ణమవుతుందని పెద్దలు అంటుంటారు. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ అమ్మతనం కోసం ఆరాటపడుతుంటారు. గర్భం ధరించాక సంతోషంతో పొంగిపోతుంటారు. ప్రస్తుతం ఓ టాలీవుడ్ నటి అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తోంది.

Tollywood: మేం నలుగురం కాబోతున్నాం.. మళ్లీ తల్లి కానున్న టాలీవుడ్ ప్రముఖ నటి.. ఎమోషనల్ వీడియో వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 10, 2025 | 8:47 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటి గుడ్ న్యూస్ చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ తో ఉన్న తన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘మా జీవితంలోకి మరో హార్ట్ బీట్ రాబోతోంది”. ఇప్పుడు మేము ముగ్గురం.. త్వరలో నలుగురం కాబోతున్నాం’ అంటూ ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నటికి ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా అభినందనల వర్షంలో మునిగితేలుతోన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించిన ప్రముఖ కన్నడ నటి చైత్ర రాయ్. దేవరలో ఆమె విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. సినిమాలో ఎక్కువగా కనిపించకపోయినా స్క్రీన్ పై ఉన్నంత సేపు ఆడియెన్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. కాగా   తెలుగుతో పాటు కన్నడ భాషల్లో బాగా ఫేమస్ అయిన చైత్ర రాయ్ ఇంజనీర్ అయిన ప్రసన్న శెట్టి ని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇప్పటికే ఒక కూతురు ఉంది. ఇప్పుడు మరోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారీ లవ్లీ కపుల్.

చైత్ర రాయ్ స్టార్ మాలో ప్రసారమైన అష్టా చమ్మా సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె స్వప్న అనే పాత్రతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. దీని తర్వాత మనసున మనసై, ఒకరికి ఒకరు, దట్ ఈజ్ మహాలక్ష్మి, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, రాధకు నీవే రా ప్రాణం తదితర ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించిందీ అందాల తార. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే పెళ్లి తర్వాత క్రమంగా సీరియల్స్ కు కూడా దూరమైందీ  అందాల తార.  అయితే ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను మరోసారి పలకరించింది.

ఇవి కూడా చదవండి

 నటి చైత్ర రాయ్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియో..

చైత్ర రాయ్ కు సినీ ప్రముఖులు, అభిమానుల అభినందనల వెల్లువ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా