AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 100కు పైగా సినిమాలు.. చిరు, బాలయ్యలతో సూపర్ హిట్స్.. ఇప్పుడేమో క్రైస్తవ మత ప్రచారకురాలిగా.. ఎవరంటే?

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ లాల్ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు అందించింది. అయితే ఇప్పుడు క్రైస్తవ మత బోధకురాలిగా స్థిరపడిపోయింది.

Tollywood: 100కు పైగా సినిమాలు.. చిరు, బాలయ్యలతో సూపర్ హిట్స్.. ఇప్పుడేమో క్రైస్తవ మత ప్రచారకురాలిగా.. ఎవరంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 12, 2025 | 2:05 PM

Share

తమిళనాడులోని తంజావూరులో జన్మించిన ఈ అందాల తార మొదట బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. వందకు పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ లాల్, మమ్ముట్టి తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్ గా, 90స్‌ డ్రీమ్ గర్ల్ పేరు తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుంది. భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. పెళ్లయ్యాక కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైంది. అదే సమయంలో భర్తతోనూ విడాకులు తీసుకుంది. ప్రస్తుతం అమెరికాలోనే నివాసముంటూ క్రైస్తవ మత ప్రచారకురాలిగా బిజి బిజీగా గడుపుతోంది. ఇటీవల ఆమెకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. వీటిని చూసిన సినీ అభిమానులు నటిని చూసి ఆశ్చర్యపోయారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడు స్లిమ్ గా, నాజూకుగా ఉన్న ఈ అందాల తార ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? తను మరెవరో కాదు ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించిన మోహినీ అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్.

1991లో ఈరమన రోజావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోహిని. ఆ తర్వాత బాలయ్య ఆదిత్య 369 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత డిటెక్టివ్ నార, మామ బాగున్నావ్, హిట్లర్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 100 కి పైగా సినిమాల్లో నటించిన మోహినీ కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే 2011 తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎక్కడా కనిపించలేదు. మోహిని చివరిసారిగా 2011లో మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కలెక్టర్‌లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

మోహినీ లేటెస్ట్ వీడియో..

కాగా భరత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది మోహినీ. ఆతర్వాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విడాకులు తీసుకున్న మోహిని ప్రస్తుతం సింగిల్ మదర్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. అలాగే క్రైస్తవ మత బోధకురాలిగా వివిధ ప్రచార కార్యక్రమాల్లో నూ పాల్గొంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..