AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..? ఛార్జీల విధింపునకు రంగం సిద్దం.. ఆర్బీఐ నుంచి అప్డేట్ వచ్చేసింది..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించేందుకు రంగం సిద్దమైంది. త్వరనే దీనికి సంబంధించిన బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఆయన ఏమన్నారు అనేది చూద్దాం.

RBI: యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..? ఛార్జీల విధింపునకు రంగం సిద్దం.. ఆర్బీఐ నుంచి అప్డేట్ వచ్చేసింది..
Upi Payments
Venkatrao Lella
|

Updated on: Aug 05, 2026 | 7:45 PM

Share

యూపీఐ ట్రాన్సాక్షన్లపై కేంద్రం ఎండీఆర్ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్రం ఆర్ధికశాఖ బిల్లు కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా వ్యాపారులకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధించే అవకాశముంది. రూ.2 వేలు దాటి చేసే ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ చార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. దీని వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం వ్యాపారులకు మాత్రం ఛార్జీలు విధిస్తారు. గతంలోనూ ఈ ప్రతిపాదన తీసుకురాగా.. ఆ తర్వాత కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఎండీఆర్ ఛార్జీలపై మరో స్టెప్ ముందుకు వేసింది. దీంతో త్వరలోనే ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఆర్బీఐ గవర్నర్ రియాక్షన్ ఇదే..

అయితే ఈ ఛార్జీల విషయంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూద్దామన్న ఆయన.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా యూపీఐ నిర్వహణ, ఈ వ్యవస్థను నడిపేందుకు అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనిన తేల్చిచెప్పారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు అయ్యే ఖర్చును ఎవరో ఖర్చు భరించాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ మానీటరీ పాలసీ కమిటీ సమావేశంలో నేటితో ముగిశాయి. ఈ సందర్బంగా సంజయ్ మల్హోత్రా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో యూపీఐ ఛార్జీల విషయంపై స్పందించారు.

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు

అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై పెద్ద వ్యాపారులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధింపునకు సిద్దమైంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్‌లో కేంద్రం సవరణలు చేయనుంది. రూ.2 వేలుపైబడిన లావాదేవీలకు ఎండీఆర్ రేటు 0.3 శాతం నుంచి 0.5 శాతం మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఛార్జీలను ఇంకా కేంద్రం ఖరారు చేయలేదు. కేవలం పెద్ద వ్యాపారులకు మాత్రమే వీటిని విధించనున్నారు. దీని వల్ల సామాన్యులపై ఎలాంటి భారం పడదు. సామాన్యులు ఎప్పటిలాగే ఉచితంగా యూపీఐ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అయితే యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు వ్యాపారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ చార్జీలను బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు భరిస్తున్నారు. ఇప్పటినుంచి వ్యాపారులు వీటిని భరించాల్సి ఉంటుంది. కేవలం అధిక టర్నోవర్ ఉన్న వ్యాపారులకు ఛార్జీలు విధిస్తారు.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల