కేంద్రం డెసిషన్.. తగ్గనున్న టేక్ హోం శాలరీ

Venkatrao Lella

Images: Pinterest

17  Sep 2026

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ఆమోదముద్ర వేసింది. త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.

కేబినెట్ నిర్ణయం

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 51 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. మరింతమందికి పీఎఫ్ ప్రయోజనాలు దక్కనున్నాయి. ఇందుకోసం కేంద్రం నిధులను కూడా విడుదల చేసింది.

51 లక్షల మందికి..

రూ.25 వేలకు పెంచడం వల్ల ఉద్యోగులకు చేతికి వచ్చే జీతం తగ్గనుంది. దాదాపు నెలకు రూ.1200 వరకు తగ్గే అవకాశముంది. ఉద్యోగి జీతంలో 12 శాతం పీఎఫ్ కోసం కట్ చేస్తారు. ఇప్పుడు రూ.25 వేలకు పెంచడం వల్ల జీతంపై ప్రభావం చూపనుంది.

టేక్ హోం శాలరీ

ఉద్యోగి CTC స్ధిరంగా ఉండి.. పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను అందులోనే సరద్దుబాటు చేస్తే టేక్ హో శాలరీ తగ్గుతుంది.  ప్రస్తుతం జీతంలో కొత ఉన్నప్పటికీ.. పీఎఫ్ రూపంలో భవిష్యత్తులో ఎక్కువ నిధి ఏర్పడుతుంది.

భవిష్య నిధి

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగికి పదవీ విరమణ పొదుపు అనేది తగ్గుతుంది.  ఇక ఉద్యోగులకు పెన్షన్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) ప్రయోజనాలు కూడా కొత్తగా పరిధిలోకి వస్తే వారికి దక్కుతాయి.

అనేక బెనిఫిట్స్

ఎక్కువమంది ఉద్యోగులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం శాలరీ లిమిట్ పెంచింది. దీని వల్ల రూ.25 వేల వరకు జీతం పొందేవారికి పీఎఫ్ తప్పనిసరి కానుంది.

ఎక్కువమందికి ప్రయోజనాలు

చివరిసారిగా 2014లో వేతన పరిమితి పెంచారు. అప్పుడు రూ.6500 నుంచి రూ.15 వేలకు పెంచారు.12 ఏళ్ల తర్వాత ఇప్పుడు దానిని రూ.25 వేలకు పెంచారు.

2014 తర్వాత

ఈ మార్పు వల్ల లక్షలాది మంది ఉద్యోగుకు కొత్తగా పీఎఫ్, పెన్షన్, బీమా, సామాజిక భద్రతా ప్రయోజనాలు దక్కనున్నాయి.

ప్రయోజనాలు ఇవే

అయితే టేక్ హోం శాలరీ తగ్గనుండగా.. పెన్షన్, బీమా సొమ్ము అనేది పెరుగుతుంది. బీమా పరిమితి రూ.10 లక్షలకు పెరిగే అవకాశముంది.

బీమా పరిమితి