బంగారం ధరలు పెరిగినా తక్కువ ధరల్లో జ్యువెలరీస్‌ కొనడం ఎలాగో తెలుసా?

September 18, 2026

Subhash

బంగారం ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. ఆభరణాలు కొనాలనుకునే వారికి బడ్జెట్ పెద్ద సవాలుగా మారింది. అయితే కొన్ని జాగ్రత్తలతో ఖర్చును నియంత్రించుకోవచ్చు.

బంగారం ధరలు 

2025తో పోలిస్తే బంగారం ధర దాదాపు 50 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో గతంలో కొనుగోలు చేసినంత బంగారం ఇప్పుడు అదే బడ్జెట్‌లో కొనడం కష్టంగా మారింది.

ధరలు

ధరలు పెరగడంతో చాలామంది వినియోగదారులు ఎక్కువ బరువున్న ఆభరణాలకు దూరంగా ఉంటున్నారు. చిన్న బరువులో న

తక్కువ బరువు

బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవాలంటే లైట్ వెయిట్ జువెలరీ ఒక ఎంపిక. మాలలు, గాజులు, ఉంగరాలు వంటి వాటిలో తక్కువ బరువున్న డిజైన్లను ఎంచుకోవచ్చు.

లైట్ వెయిట్ ఆభరణాలు

ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు భారీ ఆభరణాలు కొనాల్సిన అవసరం ఉందా అని ముందుగా ఆలోచించండి. మీ బడ్జెట్‌కు సరిపోయే బరువును ముందే నిర్ణయించుకోండి.

అవసరానికి తగ్గట్టే కొనండి

సాధారణంగా 22 క్యారెట్ బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మార్కెట్లో 18, 14, 9 క్యారెట్ బంగారు ఆభరణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధర కారణంగా వీటిపైనా ఆసక్తి పెరుగుతోంది.

22 క్యారెట్ 

క్యారెట్ తక్కువైతే బంగారంలో స్వచ్ఛమైన బంగారం శాతం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ధర మాత్రమే కాకుండా స్వచ్ఛత, హాల్‌మార్క్, మేకింగ్ ఛార్జీలు వంటి అంశాలను కూడా పరిశీలించండి.

క్యారెట్

బంగారం ధరలు పెరిగిన సమయంలో పెద్ద మొత్తంలో కొనడం కంటే..చిన్న బరువు + మీ బడ్జెట్‌కు సరిపోయే డిజైన్ + సరైన క్యారెట్ ఎంపికపై దృష్టి పెట్టండి.

బడ్జెట్