పోస్ట్ ఆఫీస్ పథకాలు దేశంలో బాగా పాపులర్ అయ్యాయి. వీటికి ప్రభుత్వ హామీతో పాటు ఎలాంటి రిస్క్ ఉండదు. మీరు పెట్టే పెట్టుబడి పూర్తి సురక్షితంగా ఉంటుంది
పోస్టాఫీస్ స్కీమ్స్
పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఇటీవల ప్రజాదరణను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. నెలవారీ ఆదాయం ఇందులో పొందవచ్చు.
ప్రతీ నెలా ఆదాయం
ప్రతీ నెలా ఆదాయం పొందాలనుకునేవారికి ఇది మంచి పథకం. దీనిని ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ప్రతి నెలా వడ్డీ మీ ఖాతాలో జమ అవుతూనే ఉంటుంది.
ఐదేళ్ల పాటు
ఈ అకౌంట్‌ను ఒకే వ్యక్తి లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి తెరవవచ్చు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ కూడా ఖాతాను తెరిచే అవకాశం ఉంది.
ఇద్దరు కలిసి..
ఒక సింగిల్ అకౌంట్లో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇక జాయింట్ అకౌంట్‌లో రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్యభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
రూ.15 లక్షలు
జాయింట్ ఖాతాలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే, వార్షిక వడ్డీ రూ. 1,11,000 అవుతుంది. ఈ మొత్తాన్ని 12 నెలలకు విభజిస్తే.. నెలవారీ వడ్డీ రూ. 9,250 వస్తుంది.
నెలకు ఎంతంటే..
మీరు విత్ డ్రా చేయని వడ్డీపై అదనపు వడ్డీ సమకూరుతుంది. దీంతో మీ ఆదాయం మరింత పెరుగుతుంది. జమ చేసిన మొత్తంపై వడ్డీ లెక్కిస్తారు.
నెలవారీగా..
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తూ ఉంటుంది. దీంతో భవిష్యత్తులో వడ్డీ రేట్లు మారవచ్చు.
వడ్డీ రేట్లు..
మీ సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ అకౌంట్ తెరవొచ్చు. ఐదేళ్ల వరకు మెచ్యూరిటీ ఉంటుంది. అనంతరం వడ్డీతో సహా మీ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ప్రతీ నెలా ఈ స్కీమ్ ద్వారా ఆదాయం పొందవచ్చు