క్రెడిట్ కార్డులో ఈ తప్పులు చేస్తే జీవితాంతం బాధపడతారు..
Venkatrao Lella
Images: Pinterest
19 Sep 2026
క్రెడిట్ కార్డుల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ వంటివి పొందవచ్చు. కానీ చిన్నపొరపాటు చేస్తే అధిక వడ్డీ ఉచ్చులో పడతారు.
ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టే సమయంలో మినిమం బ్యాలెన్స్ చెల్లించడం వల్ల నష్టమే జరుగుతుంది. కనీస బ్యాలెన్స్ కట్టడం వల్ల మిగతా బ్యాలెన్స్‌పై ఏడాదికి 42 శాతం వరకు ఫైనాన్స్ ఛార్జీలు పడతాయి. దీని వల్ల మీ మొత్తం పెరుగుతుంది.
ఏటీఎం ద్వారా క్రెడిట్ కార్డు ఉపయోగించి డబ్బులు డ్రా చేయడం వల్ల భారీగా నష్టపోతారు. ఎందుకంటే అడ్వాన్స్ ఫీజులతో ముందస్తు వడ్డీలు పడతాయి. అలాగే 45 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా వర్తించదు.
ఇక మీ క్రెడిట్ కార్డు పరిమితిని మొత్తం ఉపయోగించకూడదు. దీని వల్ల మీరు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుస్తుంది. దీని వల్ల సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశముంది.
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లించడం వల్ల భారీగా ఫైన్లు, అధిక వడ్డే, ఆలస్యపు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.
మీ క్రెడిట్ కార్డ్ నెలవారీ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ ఉండాలి. బిల్లింగ్ లోపాలు, మోసపూరిత ఛార్జీలు, మరచిపోయిన పునరావృత సబ్‌స్క్రిప్షన్లు వంటివి త్వరగా గుర్తించవచ్చు
రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లకు కచ్చితమైన గడువు తేదీలు ఉంటాయి. వీటిని ఉపయోగించుకోకపోతే మీరు నష్టపోయినట్లు అవుతుంది. దీంతో వీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలి.
తక్కువ సమయంలో ఎక్కుడ క్రెడిట్ కార్డ్ దరఖాస్తులను సమర్పించకూడదు. ఇది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావితం చూపుతుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను తాత్కాలికంగా తగ్గిస్తుంది.
పాత క్రెడిట్ కార్డులను మూసివేయకూడదు. దీని వల్ల మీ మొత్తం క్రెడిట్ తగ్గుతుంది. క్రెడిట్ హిస్టరీ నిడివి కూడా తగ్గుతుంది.