AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. కూరగాయలు లేనప్పుడు వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

తెలుగువారి లోగిళ్లలో నిల్వ పొడులకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ ఘాటైన గుంటూరు ఎండుమిరపకాయలతో చేసే సంప్రదాయ 'నల్ల కారం' అంటే ఇష్టపడని వారుండరు. మార్నింగ్ టిఫిన్లయిన ఇడ్లీ, కరకరలాడే నేతి దోశ, ఉప్మా నుంచి.. మధ్యాహ్నం వేడివేడి అన్నంలోకి మొదటి ముద్దగా నెయ్యితో కలుపుకుని తినడానికి ఈ కారం ఒక అమృతంలా పనిచేస్తుంది.

Phani CH
|

Updated on: Sep 19, 2026 | 10:32 PM

Share
అయితే చాలామంది ఎండుమిరపకాయలను కాయలు కాయలుగానే వేయించేస్తుంటారు; దీనివల్ల లోపల ఉండే విత్తనాలు పచ్చిగా ఉండిపోయి కారం పూర్తి రుచి రాదు. కాయలను తుంచి విత్తనాలను వేరుచేసి, వాటిని ప్రత్యేకంగా నూనెలో దోరగా వేయించి పొడి చేస్తే నల్ల కారానికి అసలైన సువాసన, గాఢత వస్తాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా నెలల పాటు నిల్వ ఉండే ఈ అథెంటిక్ నల్ల కారం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 6
కావలసిన పదార్థాలు: 50 గ్రాముల గుంటూరు ఎండుమిర్చి, సుమారు 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీస్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, పులుపుకి సరిపడా చింతపండు, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, రెండు రెమ్మల కరివేపాకు, 2 నుండి 3 స్పూన్ల వంట నూనె, రుచికి సరిపడా ఉప్పు

2 / 6
తయారీ విధానం: ఎండుమిరపకాయల తొడిమలు తీసి, వాటిని మధ్యలోకి తుంచుకోవాలి. ఇలా తుంచడం వల్ల లోపల ఉన్న గింజలు/విత్తనాలు బయటకు రాలిపోతాయి; వాటిని ఒక గిన్నెలోకి వేరుగా తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో రెండు మూడు స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె మరీ ఎక్కువ కాగకముందే తుంచిన ఎండుమిర్చి ముక్కలను వేసి లో ఫ్లేమ్‌పై మాడిపోకుండా దోరగా వేయించి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి.

3 / 6
మిగిలిన నూనెలో ఒక టీస్పూన్ పచ్చిశనగపప్పు వేసి లేత రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ వెంటనే ధనియాలు వేసి నిదానంగా వేపాలి. ధనియాలు కొద్దిగా వేగాక, ముందుగా వేరుచేసి పెట్టుకున్న ఎండుమిర్చి విత్తనాలను కూడా వేసి వేయించాలి. అనంతరం జీలకర్ర, కరివేపాకు రెబ్బలు మరియు చింతపండు వేసి చిన్న మంటపై వేయించాలి. నూనెలో చింతపండు కాస్త మెత్తబడితే మిక్సీ పట్టినప్పుడు సులభంగా నలుగుతుంది. ఈ దినుసులన్నీ వేగిన వెంటనే ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

4 / 6
దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో మొదట వేయించిన ధనియాలు, జీలకర్ర, పప్పు, ఎండుమిర్చి గింజలు, చింతపండు మరియు సరిపడా ఉప్పు వేసి మెత్తటి పొడిలా చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్‌లో వేయించి ఉంచుకున్న ఎండుమిర్చిని వేసి విడిగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసిన దినుసుల పొడిని కూడా ఇందులో వేసి రెండూ సమంగా కలిసేలా మరోసారి మిక్సీ పట్టాలి.

5 / 6
చివరగా 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలను వేసి జస్ట్ ఒక్కసారి మాత్రమే పల్స్ తిప్పాలి. ఇక్కడ వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచినట్టు ఉండాలి తప్ప మెత్తని పేస్ట్‌లా చేయకూడదు. ఈ పొడిని గిన్నెలోకి తీసుకుని గరిటెతో పైనుంచి కిందికి బాగా కలిపి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే సంప్రదాయ ఆంధ్రా నల్ల కారం పొడి సిద్ధం! వేడి అన్నంలో స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని తిన్నా, ఇడ్లీ దోశలపై చల్లుకున్నా అదిరిపోయే రుచినిస్తుంది

6 / 6
Follow Us
ఇదే జరిగితే దీపావళి నాటికి బంగారం రూ.లక్షకు డౌన్..?

బీసీ హాస్టల్‌లో విషాదం.. బాత్రూంలో విద్యార్థి మృతి!

దేశంలో జనాభా లెక్కలకు షెడ్యూల్ రిలీజ్.. ఎప్పటి నుంచంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక గురించి మీకు ఎంత తెలుసు?

సినిమా ఆశ చూపి హత్యలు.. రియల్ స్టోరీతో తెరకెక్కిన మూవీ..

వేడి వల్ల తలనొప్పి వస్తోందా? వెంటనే ఉపశమనం కలిగించే ఈజీ చిట్కాలు

మద్యానికి బానిసై.. ఇండస్ట్రీకి దూరమై..
మద్యానికి బానిసై.. ఇండస్ట్రీకి దూరమై..
బాలింతలకు సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు?దీని వెనుక ఉన్న కారణాలివే

ఆక్వా రంగంపై అర్నబ్ ఎఫెక్ట్.. కన్నీరుమున్నీరవుతున్న రొయ్యల రైతులు

స్వచ్చమైన వెండిని గుర్తించడం ఎలా..? ఈ సింపుల్ విషయం తెలిస్తే చాలు