AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: కేవలం ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ అకౌంట్ గుర్తించవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త వెబ్‌సైట్.. ఎలా పనిచేస్తుందంటే..?

పాత పీఎఫ్ అకౌంట్ వివరాలు మార్చిపోయారా...? లేదా మూడు సంవత్సరాల పాటు మీ అకౌంట్లో కాంట్రిబ్యూషన్ జమ కాకపోవడంతో ఇనాక్టివ్ అయిందా..? ఇలాంటి సమయంలో మీ అకౌంట్‌ను గుర్తించి అందులోని సొమ్మును క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారా..? అయితే మీకు ఊరట కలిగినట్లే. ఈపీఎఫ్‌వో కీలక ముందడుగు వేసింది.

Venkatrao Lella
|

Updated on: Aug 05, 2026 | 7:23 PM

Share
ఈపీఎఫ్ఓ మరో కొత్త వెబ్‌సైట్ తీసురానుంది. పాత పీఎఫ్ అకౌంట్ లేదా ఇనాక్టివ్ అయిన తమ అకౌంట్లను ఖాతాదారులు సులువుగా గుర్తించేందుకు కొత్త పోర్టల్ ప్రవేశపెట్టనుంది. చాలమంది తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో పాత పీఎఫ్ అకౌంట్‌ డీటైల్స్ మర్చిపోతూ ఉంటారు. ఇక ఉద్యోగం మారిన తర్వాత చాలాకాలం పాటు పీఎఫ్ అకౌంట్‌ ఉపయోగించకుండా అలాగే ఉంచితే మూడేళ్ల తర్వాత ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది. దీంతో ఇలాంటి అకౌంట్లను ఖాతాదారులు గుర్తించేందుకు ఈ కొత్త పోర్టల్ ఈపీఎఫ్‌వో తీసుకొస్తుంది

1 / 5
ఈ కొత్త ఫ్లాట్‌ఫామ్ ద్వారా పాత లేదా ఇనాక్టివ్ అయిన PF ఖాతాలను గుర్తించవచ్చు. అలాగే అందులో ఉన్న బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు నగదును క్లెయిమ్ చేసుకోవచ్చు. 'ఇ-ప్రాప్తి' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను EPFO ​​ఆగస్టు నెలాఖరు నాటికి ప్రారంభించనుంది. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించే ముందు సెంట్రలైజ్డ్ డేటాబేస్‌ను రూపొందించడానికి EPFO ​​ప్రస్తుతం బ్యాక్-ఎండ్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను పరీక్షిస్తోంది.

2 / 5
ఇనాక్టివ్ అయిన లక్షల అకౌంట్లలో క్లెయిమ్ చేయని సొమ్ము అలాగే మిలిగి ఉంది. దాదాపు 30.91 లక్షల అకౌంట్లలో రూ.9,330 కోట్లు సొమ్ము ఇప్పటికీ క్లెయిమ్ చేసుకోలేదు. వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎలాంటి చెల్లింపులు అందకపోతే EPF అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది.  దీంతో ఈ అకౌంట్లలోని సొమ్మును క్లెయిమ్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ-ప్రాప్తి పోర్టల్ తీసుకొస్తున్నారు.

3 / 5
కేవలం ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా పాత పీఎఫ్ అకౌంట్లను గుర్తించవచ్చు. అలాగే అందులోని సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కొత్ వెబ్ సైట్ గురించి అధికారిక ప్రకటన చేశారు.
ఈ పోర్టల్ ద్వారా UAN అనుసంధానం, యాక్టివేషన్‌ లాంటివి కూడా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

కేవలం ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా పాత పీఎఫ్ అకౌంట్లను గుర్తించవచ్చు. అలాగే అందులోని సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కొత్ వెబ్ సైట్ గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ పోర్టల్ ద్వారా UAN అనుసంధానం, యాక్టివేషన్‌ లాంటివి కూడా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

4 / 5
యూనివర్సల్ అకౌంట్ నంబర్‌తో లింక్ అవ్వని పాత EPF ఖాతాలను సభ్యులు సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ప్రొఫైల్‌లను అప్‌డేట్ చేసుకోవడం, UAN అనుసంధానం, యూఏఎన్ యాక్టివేషన్‌ లాంటి పనులు పూర్తి చేయవచ్చు. ఇప్పటివరకు పాత, ఇనాక్టివ్ అకౌంట్లను గుర్తించేందుకు పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటినుంచి ఆ పని ఉండదు. ఇంటి నుంచే సులువుగా మీ పని పూర్తవుతుంది.

5 / 5
Follow Us