AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది సార్ మన రేంజ్..! ఈజిప్ట్ మనసు దోచుకున్న మన ‘పినాకా’..

భారత రక్షణ రంగ తయారీ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. తాజాగా, ఆఫ్రికా-మధ్యప్రాచ్య దేశాల్లో కీలక శక్తిగా ఉన్న ఈజిప్ట్.. తన సుదూర ఆర్టిలరీ సామర్థ్యాన్ని ఆధునీకరించుకునేందుకు భారత్‌కు చెందిన 'పినాకా' రాకెట్ సిస్టమ్‌ను పరిశీలిస్తోంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన 'హిమార్స్' (HIMARS) రాకెట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా..

Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 6:51 PM

Share
భారత రక్షణ రంగ తయారీ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. తాజాగా, ఆఫ్రికా-మధ్యప్రాచ్య దేశాల్లో కీలక శక్తిగా ఉన్న ఈజిప్ట్.. తన సుదూర ఆర్టిలరీ సామర్థ్యాన్ని ఆధునీకరించుకునేందుకు భారత్‌కు చెందిన 'పినాకా' రాకెట్ సిస్టమ్‌ను పరిశీలిస్తోంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన 'హిమార్స్' (HIMARS) రాకెట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా భారత్ తయారు చేసిన స్వదేశీ 'పినాకా' (Pinaka) మల్టీ బెరల్ రాకెట్ లాంచర్‌పై ఇప్పుడు ఈజిప్ట్ కన్నేసింది. తక్కువ ఖర్చుతో అత్యంత కచ్చితమైన దాడులు చేయగల సత్తా ఉండటంతో ఈజిప్ట్ సైన్యం దీనిపై తీవ్ర ఆసక్తి చూపుతోంది.

1 / 5
పినాకా ప్రత్యేకతలు ఏమంటే. ఖచ్చితమైన దాడి (Precision Strike): కేవలం గుడ్డిగా రాకెట్లను కురిపించకుండా, శత్రువుల కమాండ్ సెంటర్లు, రాడార్లు, లాజిస్టిక్స్ హబ్స్‌ను కచ్చితంగా ధ్వంసం చేసేలా దీనిని తీర్చిదిద్దారు. ఇందులో INS, GPS తో పాటు భారత్ స్వదేశీ NavIC శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ను జోడించారు. రేంజ్ పెరుగుతుంది. ఎన్హాన్స్డ్ రేంజ్ పినాకా: 45-60 కి.మీ, గైడెడ్ పినాకా: 75-80 కి.మీ, లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (LRGR): ఏకంగా 120 కి.మీ దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.

2 / 5
ఒకే లాంచర్ - రకరకాల రాకెట్లు.. ఈ మాడ్యులర్ డిజైన్ వల్ల ఒకే లాంచర్ నుంచి వేర్వేరు శ్రేణులకు చెందిన రాకెట్లను ప్రయోగించవచ్చు. దీనివల్ల నిర్వహణ ఖర్చు (Maintenance cost), సిబ్బంది శిక్షణ భారం చాలా వరకు తగ్గుతుంది. గతంలో అమెరికా, యూరప్, రష్యా దేశాలపైనే పూర్తిగా ఆధారపడిన ఈజిప్ట్.. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆంక్షలు, సప్లై చైన్ రిస్క్‌ల కారణంగా తన రక్షణ భాగస్వాములను మార్చుకుంటోంది. ఇందులో భాగంగానే స్వతంత్ర విదేశాంగ విధానం కలిగిన భారత్‌తో రక్షణ బంధాన్ని బలపరుచుకోవాలని భావిస్తోంది.

3 / 5
ఈజిప్ట్ కేవలం పినాకాపైనే కాకుండా, భారత్‌కు చెందిన 'ఆకాశ్' (Akash) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్రపంచ ప్రఖ్యాత 'బ్రహ్మోస్' (BrahMos) సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులపై కూడా ఆసక్తి కనబరుస్తోంది. ఈ ఒప్పందాలు కార్యరూపం దాలిస్తే.. భారత్-ఈజిప్ట్ మధ్య రక్షణ రంగంలో సరికొత్త శకం ప్రారంభం కానుంది.

4 / 5
ఈజిప్ట్ లాంటి దేశాలు భారతీయ ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా.. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌లో 'మేక్ ఇన్ ఇండియా' ఆయుధాల విశ్వసనీయత మరింత పెరుగుతుంది. పినాకాతో భారత రక్షణ ఎగుమతులు మరో స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

5 / 5
Follow Us