Tollywood: పదో తరగతిలోనే హీరోయిన్‌గా ఎంట్రీ .. సినిమా కోసం ఈత రాకున్నా నీళ్లలోకి దూకింది.. ఎవరో తెలుసా?
సాధారణంగా సినిమాల్లో చాలా సీన్స్ కు డూప్ లను వినియోగిస్తుంటారు. అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం చాలా డేరింగ్ అండ్ డ్యాషింగ్. సినిమాలపై మక్కువతో తనకు ఈత రాకున్నా నీళ్లలోకి దూకింది. పదో తరగతిలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే డిగ్రీ పూర్తి చేయడం గమనార్హం.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జులై 11) కూడా థియేటర్లలోకి పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో పలు తెలుగు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాల్లో నటించిన ఒక హీరోయిన్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పటివరకు కేవలం ఐదారు సినిమాల్లోనే నటించింది. అవి కూడా తమిళ్, మలయాళ సినిమాలే. పదో తరగతిలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో మొదటిసారిగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. అది కూడా ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళుతోన్న సుహాస్ నటించిన తాజా చిత్రం ఓ భామ అయ్యో రామ. రామ్ గోధల తెరకెక్కించిన ఈ సినిమాతో ఒక కొత్త హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆమె పేరు మాళవిక మనోజ్. ఈ బ్యూటీ పదో తరగతి చదువుతున్న సమయంలోనే వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. తమిళంలో మాళవిక నటించిన జో మూవీ పెద్ద హిట్టవడంతో ఈ ముద్దుగుమ్మకు మంచి పాపులారిటీ లభించింది.
కాగా ఓ భామ అయ్యో రామ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన మనోజ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.’ నాకు స్విమ్మింగ్ రాకపోయినా.. ఓ సన్నివేశంలో షూటింగ్ వాయిదా పడటం ఇష్టం లేక భయపడుతూనే నీళ్లలోకి దూకేశాను. నాకెప్పుడూ డిఫరెంట్‌గా ఛాలెంజ్ విసిరే పాత్రలు చేయాలని ఉంటుంది. ‘‘తమిళంలో నటించిన ‘జో’లో నా అభినయం చూసి దర్శకుడు రామ్ ‘ఓ భామ అయ్యో రామ’ కోసం అడిగారు. కథ వినగానే నాకు ఎంతో నచ్చింది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది.
ఓ భామ అయ్యో రామ సినిమా ప్రమోషన్లలో సుహాస్, మనోజ్ మాళవికల డ్యాన్స్..
View this post on Instagram
మాళవిక మనోజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








