AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత బిల్డప్ ఇచ్చారుగా సామీ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. కానీ ఓటీటీ కాపాడేసింది..

థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కుబేర సినిమా థియేటర్స్ లో విడుదలై పేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఓటీటీలోనూ కొన్ని సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రతి శుక్రవారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

అంత బిల్డప్ ఇచ్చారుగా సామీ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. కానీ ఓటీటీ కాపాడేసింది..
Movie
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2025 | 2:05 PM

Share

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

ఇది కూడా చదవండి :ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు

అలానే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. థియేటర్స్ లో డబుల్ డిజాస్టర్ అయ్యింది. అంతేకాదు భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్ పేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.. బాలీవుడ్ లో తెరకెక్కిన బెల్ బాటమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.

ఇది కూడా చదవండి :Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 19న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కరోనా నుంచి కోలుకునే సమయంలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘బెల్‌ బాటమ్‌’ మొదటి రోజున కేవలం రూ.2.75 కోట్లు సంపాదించింది. ఈ సినిమా 1980ల నేపథ్యంలో జరుగుతుంది. వాణి కపూర్ అక్షయ్ భార్యగా యాక్ట్‌ చేసింది. హుమా ఖురేషి, ఆదిల్ హుస్సేన్, అనిరుద్ధ్ డేవ్ కూడా కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆట్టుకుంటుంది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ సినిమాను ఓటీటీ ఒకింత కాపాడిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..