ఆలియాకు మాజీ పీఏ టోకరా..ఏకంగా రూ.77 లక్షలు వీడియో
ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్‌కు ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ భారీ షాకిచ్చింది. నమ్మకంగా పనిచేస్తూనే, నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.77 లక్షలు కాజేసింది. ఈ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పలు రాష్ట్రాల్లో గాలించి ఎట్టకేలకు నిందితురాలిని బెంగళూరులో అరెస్ట్ చేశారు.
వేదిక ప్రకాశ్ శెట్టి అనే మహిళ 2021 నుంచి 2024 వరకు ఆలియా భట్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఈ సమయంలో ఆలియా వ్యక్తిగత ఖాతాలతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్’ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకునేది. 2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్య కాలంలో వేదిక నకిలీ బిల్లులతో రూ.76.9 లక్షలను పక్కదారి పట్టించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రయాణాలు, మీటింగ్‌లు, ఇతర ఖర్చుల పేరుతో వేదిక నకిలీ బిల్లులను తయారుచేసి, వాటిపై ఆలియా సంతకాలు తీసుకునేది. ఆ బిల్లులు అచ్చం అసలువాటిలా కనిపించేందుకు ప్రొఫెషనల్ టూల్స్ వాడినట్లు విచారణలో తేలింది. ఆమోదం పొందిన తర్వాత ఆ డబ్బును తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ చేయించి, అక్కడి నుంచి తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకునేదని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు వీడియో
థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
