AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు వీడియో

మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు వీడియో

Samatha J
|

Updated on: Jul 14, 2025 | 2:29 PM

Share

చిన్న పిల్లల విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది తీవ్ర అనర్థాలకు దారితీస్తుందని పూనేలో జరిగిన ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. తల్లిని వెతుక్కుంటూ వచ్చిన ఓ నాలుగేళ్ల బాలిక అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ప్రమాదకరమైన స్థితిలో వేలాడుతూ కనిపించిన ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరికగా నిలిచింది. మహారాష్ట్రలోని పూనే నగర్లోని కాత్రాజ్ ప్రాంతంలోని ఒక భారీ అపార్ట్‌మెంట్‌లో ఒక కుటుంబం నివాసం ఉంటుంది

. ఆ కుటుంబంలోని యువతి బడిలో ఉన్న తన కూతుర్ని తీసుకువద్దామని బయలుదేరి వెళుతూ తన నాలుగేళ్ల రెండో కూతుర్ని మూడో అంతస్తులోనే తమ ఫ్లాట్లోనే ఉంచి బయట నుంచి తలుపు వేసి వెళ్లింది. దీంతో తల్లి ఎక్కడికి వెళ్లిందో చూద్దామని ఆ బాలిక బయట తలుపులు రాకపోవడంతో బాల్కనీ వైపు ఉన్న ఓ కిటికీ గుండా బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. భయంతో కిటికీ ఓచులు పట్టుకొని వేలాడుతూ కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ఆ చిన్నారి ప్రాణాలను రక్షించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చుట్టుపక్కల వారు ఈ సంఘటనను గమనిస్తున్న సమయంలో వీడియో రికార్డు చేశారు. వళ్ళు గగుర్పొట్టేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచిస్తూ నెటిజన్లు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. చిన్న ఆదరణ పెద్ద ప్రమాదానికి దారితీసే ఇలాంటి సంఘటనల పట్ల ఇకనైనా ప్రతి ఒక్కరు మేల్కొవల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో

ఆ గుళ్లో అడుగుపెడితే.. మీ పెళ్లి అయినట్లే వీడియో

ఈ రోడ్డు నుంచి సంగీతం వస్తుంది.. ఆ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే వీడియో