ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
భారీ వర్షాలతో వరద ప్రవాహం ముంచెత్తుతోంది. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వారం పది రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు. ఇప్పటికే వరదలకు పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుక్క అరుపు.. 67 మంది ప్రాణాలను కాపాడింది. సియతి గ్రామంలో ఓ శునకం పదుల సంఖ్యలో జనం ప్రాణాలను కాపాడింది.అర్ధరాత్రి దాటాక సియతి గ్రామ సమీపంలో పెద్ద కొండచరియ విరిగిపడింది. రెండో అంతస్తులోని కుక్క విపరీతంగా మొరగటంతో ఇంటి యజమాని నరేంద్ర పైకెళ్లిచూస్తే, గోడకు పగుళ్లు కనిపించాయి.
ఇంట్లోకి నీరు రావడం గమనించి వెంటనే అందరినీ నిద్రలేపాడు. చుట్టుపక్కలవారిని కూడా అప్రమత్తం చేశాడు. వారంతా వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. వారు ఆ ప్రాంతాన్ని వీడిన కాసేపటికే గ్రామంపై కొండచరియ విరిగిపడింది. నాలుగైదు ఇళ్లు తప్ప పదుల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి. ప్రాణాలతో బయటపడిన వారు గత ఏడు రోజులుగా త్రియంబాల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషాదం కారణంగా అనేక మంది గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి హిమాచల్ ప్రదేశ్‌లో వరదల ధాటికి దాదాపు 78 మంది మరణించారు. వీరిలో 50 మంది కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా మరణించగా, 28 మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

