అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అరకు లోయ. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ లోయను సందర్శిస్తారు. వీకెండ్ వస్తే చాలు అరకు చేరి తెగ ఎంజాయ్ చేస్తారు. ఎప్పటిలాగే ఆదివారం వీకెండ్ కావడంతో అక్కడకు చేరిన పర్యాటకులు ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తుండగా, వారికి ఓ అనుకోని అతిథి కనిపించింది. దానిని చూడగానే పర్యాటకులంతా భయంతో తలోదిక్కూ పారిపోయారు. తీరా అసలు సంగతి తెలిసి, దాని వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకుని షేర్ చేశారు. ఇంకొందరైతే దానికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి ఆ అతిథిని పలకరించారు. ఆ అతిథి ఎవరో కాదు టిబెటన్ మస్తీఫ్.
సింహాన్ని పోలిన ఓ శునకం. తన యజమానితో పాటు అరకు లోయకు సరదాగా షికారుకు వచ్చి, యజమాని జీపు పైకెక్కి అందరినీ పలకరించింది. ముందు దానిని చూసి అది సింహం పిల్ల అని భయంతో దూరంగా పరిగెత్తిన జనం.. అది శునకం అని తెలుసుకుని దగ్గరకు వెళ్లి విష్ చేశారు. తనను చూసేందుకు ఆప్యాయంగా దగ్గరకు వచ్చిన పర్యాటకులతో కలిసి పోయిన ఆ శునకం వారు కోరినట్లుగా పోజులిచ్చి వారిని సంతోష పెట్టేసింది. విశాఖకు చెందిన ఇషాక్ మదీనావలి అనే వ్యక్తి ఈ శునకాన్ని పెంచుకునేందుకు తెచ్చుకున్నాడు. దానికి మస్తీఫ్ సుల్తాన్ అని పేరు కూడా పెట్టి, ప్రాణంగా చూసుకుంటున్నాడు.
మరిన్నివీడియోల కోసం :
ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో
ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్
విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
అయ్యో.. సమంత చూడండి ఎక్కి ఎక్కి ఎలా ఏడ్చేసిందో.. వీడియో వైరల్
వైరల్ వీడియోలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
