ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో
ఒంటెను ఎడారి ఓడ అంటారు. నీళ్లు తాగకుండా రోజుల తరబడి ఎడారిలో ప్రయాణించగలగటం వీటి ప్రత్యేకత. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మన సైన్యం వీటిని పహరాకు కూడా వాడుతోంది. పెండ్లి వేడుకల్లో ఒంటె సవారీ రాజస్థాన్‌లో నేటికీ సంప్రదాయంగా ఉంది. సరకు రవాణా వాహనాలను మైళ్ల కొద్దీ మండిపోయే ఇసుకలో లాక్కెళ్లటం వీటి ప్రత్యేకత. ఇటీవలి కాలంలో వీటిని నగరాల్లోకి తీసుకొచ్చి పిల్లలను వాటిపైకి ఎక్కించి అనేకమంది పొట్టపోసుకుంటూ కనిపిస్తుంటారు. అయితే, ఒంటెకు ఇప్పుడు మరో అత్యంత ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఒంటె కంటి నుంచి కారే.. ఒక కన్నీటి బొట్టుకు.. 26 రకాల పాముల విషానికి విరుగుడుగా పనిచేస్తుందని నిర్ధారణ అయింది. ఇసుక తుపాన్లు, చుక్క నీరులేని ఎడారి ప్రాంతం, ఒళ్లు మండిపోయేంత ఎండ.. ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలీలగా బతికే గుణం ఒంటెకు ఉన్న ట్లే ఆ ఒంటె కన్నీటికీ అసాధారణ శక్తి ఉందని దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లేబొరేటరీ శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో తేలింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన రసాయనాలు ఎంతగానో దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బాక్టీరియాను ధ్వంసం చేసే రోగనిరోధక శక్తి ఉండే ప్రొటీన్లు ఈ ఒంటె కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, అవి అత్యంత శక్తివంతమైన పాము విషాన్ని విరిచేయగలవని పరిశోధకులు చెబుతున్నారు. సన్నని ఇసుకరేణువుల గాలిలో ఏళ్లతరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటిసంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని, ఆ కోణంలో శోధించి ఈ కొత్త విషయాన్ని సాధించామని వాళ్లు చెప్పారు. ఒంటె కన్నీటిలో పాముకాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వాళ్లు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో
సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో
సునామీ మేఘాన్ని చూసారా వీడియో
గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
