అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో
కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే వారి అస్థికలను పవిత్ర గంగానదిలో కలిపితే మోక్షం ప్రాప్తిస్తుందని హిందువులు నమ్ముతారు. అందుకే అస్థికలను కాశీలోని గంగలో నిమజ్జనం చేస్తారు. కానీ, ఇంకొందరు దీనికి విరుద్ధంగా అస్థికలను అంతరిక్షంలో శాశ్వతంగా ఉంచటం ద్వారా తమ వారికి అంతరిక్షంలోనే ఆఖరి వీడ్కోలు పలకానుకున్నారు. కానీ వారి ఆలోచన విషాదంగా ముగిసింది.
166 మంది అస్థికలతో నింగిలోకి దూసుకెళ్లిన ఒక ప్రత్యేక వ్యోమనౌక.. తన లక్ష్యాన్ని పూర్తి చేయకుండానే పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలిపోయింది. జర్మనీకి చెందిన ‘ది ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ’ అనే స్టార్టప్, అమెరికాకు చెందిన ‘సెలెస్టిస్’ అనే స్పేస్ బరియల్ సంస్థతో కలిసి ఈ వినూత్న ‘మిషన్ పాజిబుల్’ను చేపట్టింది. ఇందులో భాగంగా, జూన్ 23న ‘నిక్స్’ అనే పునర్వినియోగ క్యాప్సూల్‌ను నింగిలోకి పంపారు. ఈ క్యాప్సూల్‌లో 166 మంది అస్థికలతో పాటు, ఔషధ ప్రయోగాల నిమిత్తం కొన్ని గంజాయి విత్తనాలు, ఇతర పరిశోధనా పరికరాలను కూడా ఉంచారు. అయితే, ఆ క్యాప్సూల్ తొలి దశ ప్రయాణం సాఫీగా సాగింది. తర్వాత అది భూమి చుట్టూ రెండు కక్ష్యలను పూర్తి చేసి, భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. కొద్దిసేపు భూకేంద్రంతో కమ్యూనికేషన్‌ను కూడా పునరుద్ధరించుకుంది. అంతా సవ్యంగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో, సముద్రంలో సురక్షితంగా దిగడానికి కొన్ని నిమిషాల ముందు దానితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అనంతరం, అది పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
మరిన్ని వీడియోల కోసం :
చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో
సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో
సునామీ మేఘాన్ని చూసారా వీడియో
గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
