AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల సరదా ప్రాంక్ .. టీచర్‌ ప్రాణాలు తీసింది

విద్యార్థుల సరదా ప్రాంక్ .. టీచర్‌ ప్రాణాలు తీసింది

Phani CH
|

Updated on: Mar 12, 2026 | 9:45 AM

Share

అమెరికాలో విద్యార్థుల ప్రాంక్ ఒక టీచర్ ప్రాణం బలితీసుకుంది. జార్జియాలో మాథ్స్ టీచర్ జేసన్ హ్యూస్ ఇంటి వద్ద ప్రాంక్ చేయగా, బయటకు వచ్చిన ఆయన ప్రమాదవశాత్తు పడిపోయారు. పారిపోతున్న విద్యార్థి ట్రక్కు కింద పడి మృతి చెందారు. నిందితుడికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రాంక్ తీవ్రత పెరిగితే కలిగే అనర్థాలకు ఈ ఘటన హెచ్చరికగా నిలుస్తుంది.

విద్యార్థులు సరదా కోసం చేసిన ప్రాంక్ వారు ఎంతో అభిమానించే వారి టీచర్‌ ప్రాణాలనే బలితీసుకుంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రం నార్త్ హాల్ హైస్కూల్‌లో మాథ్స్‌ బోధిస్తున్న 40 ఏళ్ల జేసన్ హ్యూస్ కారు కింద పడి చనిపోయారు. మార్చి 5 రాత్రి కొందరు విద్యార్థులు జేసన్ హ్యూస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన ఇంటి ప్రాంగణంలోని చెట్లకు టాయిలెట్ పేపర్ చుట్టి తుంటరితనంతో ప్రాంక్ చేశారు. బయట అలికిడి కావడంతో ఏం జరుగుతుందో చూసేందుకు హ్యూస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయనను చూడగానే భయపడిన విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో బయటకు వచ్చిన హ్యూస్ అనుకోకుండా కాలు తడబడి రోడ్డుపై పడిపోయారు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో 18 ఏళ్ల ఓ విద్యార్థి పికప్ ట్రక్కును వేగంగా నడిపాడు. రోడ్డుపై పడి ఉన్న టీచర్‌ని తొక్కుకుంటూ ఆ ట్రక్కు దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. పికప్ ట్రక్‌ నడిపిన 18 ఏళ్ల వాలెస్‌పై పోలీసులు తీవ్రమైన అభియోగాలు మోపారు. అతనికి 15 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అతడితో పాటు నలుగురు టీనేజర్లపై కూడా కేసులు నమోదు చేశారు. టీచర్‌ హ్యూస్‌కు భార్య లారా, ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యార్థులు సరదా కోసం చేసిన పని ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేయడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హ్యూస్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు స్థానికులు గోఫండ్‌మీ ద్వారా క్యాంపెయిన్ ప్రారంభించగా, ఇప్పటికే 80,000 డాలర్లకు పైగా విరాళాలు సేకరించారు. ప్రాంక్‌ శృతిమించితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ముమ్మరంగా కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్

The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..

Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ

Follow Us