సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో
చైనాలో సైన్స్ పరిజ్ఞానానికే అందని వింత ఘటన జరిగింది. గత నెల రోజులుగా సజీవంగా ఉన్న పురుగుల్ని వాంతి చేసుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక చైనాలో వార్తలకెక్కింది. కుటుంబసభ్యుల్లో ఎవరికీ అలా జరగడం లేదనీ కేవలం చిన్నారి మాత్రమే ఒక సెంటీమీటర్ పొడవున్న ఈగలు కొన్నిటిని వాంతి చేసుకుంటుందనీ ఆమె తండ్రి డాక్టర్లకు తెలిపాడు. పలువురు డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయింది.
చైనాలో సైన్స్ పరిజ్ఞానానికే అందని వింత ఘటన జరిగింది. గత నెల రోజులుగా సజీవంగా ఉన్న పురుగుల్ని వాంతి చేసుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక చైనాలో వార్తలకెక్కింది. కుటుంబసభ్యుల్లో ఎవరికీ అలా జరగడం లేదనీ కేవలం చిన్నారి మాత్రమే ఒక సెంటీమీటర్ పొడవున్న ఈగలు కొన్నిటిని వాంతి చేసుకుంటుందనీ ఆమె తండ్రి డాక్టర్లకు తెలిపాడు. పలువురు డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయింది. సజీవ పురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఏ డాక్టరూ కచ్చితంగా చెప్పలేకపోయారు. తూర్పు చైనాలోని జియాంగ్జు రాష్ట్రం యాంగ్జూ నగరానికి చెందిన ఈ బాలిక విచిత్ర ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటుంది. యాంగ్జూలోని సూచౌ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక చిన్న పిల్లల డాక్టరు మాత్రం అసలు సమస్య ఎక్కడుందో కనుగొన్నారు. బాలిక వాంతి చేసుకున్న పురుగుల్ని స్థానిక వ్యాధి నియంత్రణ, నివారణ విభాగానికి చూపాల్సిందిగా డాక్టర్ జాంగ్ బింగ్ బింగ్ తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. ఆ విభాగానికి చెందిన సిబ్బంది పురుగుల్ని గుర్తించారు. ఈ పురుగులు మురుగునీటి ఈగల లార్వాలని, ఇవి గతంలో ఒక 60 ఏళ్ల మహిళలోనూ చూశామని ఆ విభాగం సిబ్బంది తెలిపారు.
మరిన్నీ వీడియోల కోసం :
ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో
రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో
రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
