సునామీ మేఘాన్ని చూసారా వీడియో
ద్రోణి ప్రభావంతో అల్పపీడనాలు ఏర్పడతాయి. ఆ సమయంలో ఆకస్మాత్తుగా నల్లని మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షాలు కురుస్తాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడమే కాకుండా.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టిస్తాయి. ఇటువంటి సమయాలలో సముద్ర తీరంలోని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తారు.
అలాగే, బీచ్‌లకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేస్తారు. తాజాగా, ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోర్చుగల్‌లోని పోవోవా డా వర్జిమ్ బీచ్‌లో ఆవిష్కృతమైన ఓ దృశ్యం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోర్చుగల్‌లో తీవ్రమైన వేడి ఉంది. ఆ సమయంలో ఈ దృశ్యం కనిపించడంతో షాక్‌కు గురవుతున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి సముద్ర తీరం వైపు ఒక భారీ, మందపాటి స్థూపాకార మేఘం వస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మేఘం తీరం వైపునకు రాగానే, బలమైన గాలులు వీయడం ప్రారంభమైంది. దీంతో బీచ్‌లోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
మరిన్నీ వీడియోల కోసం :
ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో
రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో
రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా? వీడియో
Published on: Jul 10, 2025 07:35 AM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
