ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
కన్నడ క్యూటీ రష్మిక ప్రస్తుతం ఫుల్ బిజీ.. చేతినిండా సినిమాలతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప2, ఛావా, కుబేర సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
తన పని ఒత్తిడి గురించి… హోమ్ సిక్ గురించి వివరించింది.వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల… రష్మిక.. తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతుందట.. ముఖ్యంగా తన చెల్లిని! తన చిన్నారి చెల్లితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యింది రష్మిక. తన చెల్లి చాలా చిన్నదని.. తమ మధ్య 16ఏళ్లు గ్యాప్ ఉందని చెప్పిన రష్మిక … తనను ఎదుగుదలను మిస్ అవుతున్నా అంటూ బాధపడింది. తాను ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుందని.. తన చెల్లినే కాదు.. అమ్మను ,నాన్ను అందర్నీ మిస్ అవుతున్నా అంటూ ఎమోషనల్ అయింది. తన కుటుంబ సభ్యులతో పాటు… తన ఫ్రెండ్స్‌ను కూడా బాగా మిస్ అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. కానీ వృత్తిలో రాణించాలంటే వ్యక్తిగత జీవితం త్యాగం చేయాలంటూ .తన అమ్మ ఎప్పుడూ ఓ మాట చెప్పేదని.. అందుకు తాను కూడా రెండింతలు కష్టపడి పని చేస్తా అంటూ.. చెప్పేదాన్నని గుర్తు చేసుకుంది. తన అమ్మకు చెప్పిన మాట ప్రకారమే ఇండస్ట్రీలో కస్టపడుతున్నానంటూ… వైరల్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.
మరిన్నివీడియోల కోసం :
ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో
ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్
విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
అయ్యో.. సమంత చూడండి ఎక్కి ఎక్కి ఎలా ఏడ్చేసిందో.. వీడియో వైరల్
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
