ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!
ఆకాశంలో అప్పుడప్పుడూ కొన్ని అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి. వీటిలో ఇంద్రధనుస్సు, మంచు మేఘాలు వంటివి ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంటాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి అద్భుత సన్నివేశమే వర్షాలు కురవాలని, పంటలు పండాలని తమ గ్రామ దేవతకు గ్రామస్తులు పూజలు చేస్తున్న సమయంలోనే.. ఆకాశంలో ఈ అద్భుతం ఆవిష్కృతం కావటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.
దైవకృప చేతనే ఈ అద్భుతం కనిపించిందని జనం ఆనందంలో మునిగిపోయారు. తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో పాండవుల మెట్ట స్వామివారికి స్థానికులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం తొలి ఏకాదశి వేళ.. పాలాభిషేకం, పాలు పొంగించి, నైవేద్యం చేసి స్వామివారికి నివేదించారు. సరిగ్గా ఆ సమయానికే ఆకాశంలో సూర్యభగవానుడి చుట్టూ ఒక వలయం ఏర్పడింది. ఆకాశం మేఘావృతమై ఉన్న వేళ, తొలి ఏకాదశి రోజున ఆకాశంలో ఇలా కనిపించడం భగవత్ కృపగా స్థానికులు భావిస్తున్నారు. ఆకాశంలో ఆవిష్కృతమైన ఆ అద్భుత దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
మరిన్నివీడియోల కోసం :
ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో
ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్
విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
అయ్యో.. సమంత చూడండి ఎక్కి ఎక్కి ఎలా ఏడ్చేసిందో.. వీడియో వైరల్
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
