భారీ కొండచిలువను చేతులతో మోసుకెళ్లిన పిల్లలు..వణుకు పుట్టిస్తున్న వీడియో!
ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. కొందరు పిల్లలు 15 అడుగుల భారీ కొండచిలువను ఓ ఆట వస్తువులా ట్రీట్ చేశారు. దాన్ని తమ చేతుల్లో పట్టుకొని ఊరంతా ఊరేగింపుగా తిరిగారు. దానితో సెల్ఫీలు దిగారు. కొద్ది సేపటి తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. సుమారు 3 కిలో మీటర్లు పిల్లలు ఆ కొండచిలువను పట్టుకొని తిరిగినట్టు స్థానికులు తెలిపారు. వారు ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పిల్లల చేతుల్లో ఉన్న కొండచిలువను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆశ్చర్యకర ఘటన బులంద్‌షహర్ ప్రాంతంలో జరిగింది.
స్థానికులు చెప్పిన దాని ప్రకారం.. డంగ్రా జాట్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రామస్తులకు ఒక 15 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు పిల్లలు ఆ కొండచిలువను చూసేందుకు వచ్చారు. అది ఉలుకూ పలుకూ లేకుండా పడిపోవడంతో చనిపోయిందేమోనని గ్రహించి. దాన్ని చేతుల్లోకి ఎత్తుకొని గ్రామ రోడ్ల గుండా ఊరేగిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ తీసుకెళ్లారని, అందులో కొంత మంది దాని తల, మధ్య భాగం పట్టుకొగా మరికొందరు తోకనుపట్టుకున్నారు. పిల్లల చేతిలో కొండచిలువను చూసిన రోడ్డుపై వేళ్లే వాహన దారులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
