ఆ గుళ్లో అడుగుపెడితే.. మీ పెళ్లి అయినట్లే వీడియో
ఈ రోజుల్లో చాలామంది యువతీ యువకులు తగిన జోడీ దొరక్క, మూడు పదులుదాటినా బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. మరోవైపు తమ కొడుకు లేదా కూతురుకు త్వరగా పెళ్లి కావాలంటూ వారి తల్లిదండ్రులు నానా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే, కొందరికి మాత్రం.. ఎన్ని సంబంధాలు చూసినా ముందుడుగు పడటం లేదు. అయితే, ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న బ్రహ్మచారులు తమ రాష్ట్రంలోని ఓ ఆలయానికి వచ్చి, స్వామిని దర్శించుకుంటే.. ఇట్టే పెళ్లయిపోతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. దీంతో బ్రహ్మచారులు ఆ దేవాలయ దర్శనం కోసం క్యూ కడుతున్నారు.
మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లా కేంద్రానికి 16 కి.మీ దూరంలోని జవాద్ పట్టణంలో గణపతి ఆలయం ఒకటుంది. అందులోని బావి పక్కనే.. బిల్లం బావ్‌జీ స్వామి కొలువై ఉంటాడు. ఈ బ్రహ్మచారుల దేవుడు.. సాక్షాత్తూ భైరవుని అవతారమని చెబుతారు. ఏడాది పొడవునా స్వామి.. ఇక్కడే కొలువై ఉంటాడు. కానీ, హోలీ తర్వాత ఐదవ రోజైన రంగ్ పంచమి నుంచి 9 రోజుల పాటు జరిగే స్వామీజీ జాతర వేళ.. ఆలయంలో బావి వద్ద కొలువైన స్వామిని, ఆలయంలోని గద్దె మీద ప్రతిష్టిస్తారు. ఈ సమయంలో వేలాది మంది పెళ్లి కావలసిన యువతీయువకులు, పెళ్లై సంతానం కోరుకుంటున్న జంటలు పూజలు చేయడానికి ఇక్కడకు చేరుకుంటారు. బిల్లం బావ్ జీకి భక్తులు పాన్, కొబ్బరికాయను నైవేద్యంగా నివేదిస్తారు. పెళ్లి కావాలని కోరుకునేవారు దేవుడికి సమర్పించిన పాన్ తింటారు. అలా చేస్తే వారికి వివాహం జరుగుతుందని విశ్వాసం. ఏళ్ల కొద్ది వివాహం కోసం వేచిచూసిన వారు, బిల్లం బావజీ దర్శనం తర్వాత కొన్ని రోజుల్లోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సందర్భాలు అనేక ఉన్నాయని భక్తులు అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
