కింగ్ కోబ్రాను ఒడిసి పట్టేసిన లేడీ పోలీస్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే వీడియో
దారిలో ఓ చిన్న పాము కనిపిస్తేనే భయంతో పరుగులు పెడతాం. కొందరైతే పాము పేరు చెప్పగానే గడగడా వణుకుతారు. అలాంటిది ఓ లేడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాత్రం అతి విషపూరితమైన భారీ కింగ్ కోబ్రాను అలవోకగా బంధించింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫారెస్ట్ ఆఫీసర్ ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటన కేరళలో జరిగింది.
తిరువనంతపురంలోని పెప్పరలో ఓ నివాస ప్రాంతంలోని కాలువలో స్థానికులు ఓ భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పరుథిపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి దాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. 18 అడుగుల పొడవున్న ఆ కింగ్ కోబ్రాను చాలా ప్రశాంతంగా ఓ కట్టె సాయంతో పట్టుకొని సంచిలో బంధించారు. స్థానికులు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. గతంలోనూ రోషిణి ఇలాగే 500లకు పైగా పాములను బంధించినట్లు తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
