థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
కరీంనగర్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. మసాజ్ చేయాలంటూ పిలిచి ఓ యువకుడిని చితకబాది నగదు లాక్కున్నారు దొంగలు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి అసలు గుట్టు బయటపెట్టారు. నిజామాబాద్ జిల్లా తాళ్ళపల్లి గ్రామానికి చెందిన పిపావత్ నగేష్ కరీంనగర్ లో డిగ్రీ చదువుతూ రాంనగర్ లోని ఎస్సీ హాస్టల్ లో ఉంటున్నాడు.
ఇటీవలే హైదరాబాద్ లో స్పామసాజ్ లు నేర్చుకున్న నగేష్ కరీంనగర్ వచ్చి గ్రైండర్ అనే డేటింగ్ యాప్ ను ఉపయోగించి సెన్సువల్ మసాజ్ లు చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఫోన్ చేసి కోరితే వారి వద్దకు వెళ్లి మసాజ్ చేసి డబ్బులు తీసుకునేవాడు. జూలై నాలుగవ తేదీన గ్రైండర్ యాప్ ద్వారా ఒక వ్యక్తి నగేష్ ను సెన్సువల్ మసాజ్ కోసం పిలిచాడు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్ళే దారిలో ఉన్న ఎఫ్ఎం రేడియో స్టేషన్ వద్దకు రమ్మని చెప్పడంతో నగేష్ రాపిడోలో బైక్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి పరిచయం చేసుకోగా ఆ తర్వాత ఇద్దరు కలిసి రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లోకి వెళ్లారు. మసాజ్ గురించి మాట్లాడుతుండగా అప్పటికే రెండు వైపుల నుంచి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు నగేష్ ను దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. అతని వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. భయపడిన నగేష్ తన ఫోన్ పే ద్వారా వారి నెంబర్ కు పదిహేను వేల రూపాయలు పంపించాడు. జేబులో ఉన్న రెండు వేల రూపాయలు, చేతికున్న వాచ్ ను కూడా లాగేసుకున్నారు. భయంతో రెండు రోజులు హాస్టల్ లోనే ఉన్న నగేష్ శనివారం జూలై ఆరున పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
మరిన్ని వీడియోల కోసం :
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
ఆ గుళ్లో అడుగుపెడితే.. మీ పెళ్లి అయినట్లే వీడియో
ఈ రోడ్డు నుంచి సంగీతం వస్తుంది.. ఆ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
